సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Valentines day: ఒకే రోజున 'ఫంకీ'... 'బూకి'...

ABN, Publish Date - Jan 01 , 2026 | 04:37 PM

విజయ్ ఆంటోని మేనల్లుడు హీరోగా నటిస్తున్న 'బూకి' సినిమా వాలెంటైన్స్ డే కానుకగా ఫిబ్రవరి 13న రాబోతోంది. అదే రోజున విశ్వక్ సేన్ 'ఫంకీ' సైతం జనం ముందుకు వస్తోంది.

Valentine's Day

కొత్త సంవత్సరం తొలి రోజున చాలా సినిమాల అప్ డేట్స్ వచ్చేశాయి. కొందరు నయా పోసర్ట్స్ తో ప్రేక్షకులను తమవైపు తిప్పుకుంటే మరికొందరు తమ చిత్రాల రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు. అలానే అజయ్ దిషన్ హీరోగా విజయ్ ఆంటోనీ నిర్మిస్తున్న 'బూకి' (Bookie) విడుదల తేదీ ఖరారైంది. మొదట్లో ఈ సినిమాకు 'పూకి' అని పెట్టి... దానిపై నిరసన వ్యక్తం కావడంతో మేకర్స్ దాన్ని 'బూకి'గా మార్చారు. ధనుష హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను గణేశ్‌ చంద్ర డైరెక్ట్ చేస్తున్నాడు. విజయ్ ఆంటోనీ దీనికి సంగీతం అందిస్తున్నాడు. పాండియ రాజన్, సునీల్, లక్ష్మీ మంచు, ఇందుమతి, వివేక్ ప్రసన్న కీలక పాత్రలు పోషిస్తన్నారు. ఈ సినిమాను ప్రేమికుల రోజు కానుకగా వన్ డే ముందే ఫిబ్రవరి 13న రిలీజ్ చేస్తున్నట్టు మేకర్స్ తెలిపారు.


ఇదిలా ఉంటే... అదే రోజున 'ఫంకీ' (Funky) మూవీ కూడా జనం ముందుకు రాబోతోంది. విశ్వక్ సేన్ హీరోగా కె.వి. అనుదీప్ ఈ సినిమాను రూపొందిస్తున్నాడు. సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో సూర్యదేవర నాగవంశీ, నాగ సౌజన్య దీన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. నిజానికి ఇది ఏప్రిల్ లో విడుదల కావాల్సిన సినిమా కానీ కాస్తంత ముందుగానే దీన్ని విడుదల చేయబోతున్నట్టు మేకర్స్ చెప్పారు.


ఇదిలా ఉంటే ఈ రొమాంటిక్ ఎంటర్ టైనర్స్ తో పాటే మహాశివరాత్రి కానుకగా ఫిబ్రవరి 13న 'స్వయంభు' (Swayambhu) చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్టు మేకర్స్ తెలిపారు. ఇది నిఖిల్ (Nikhil) నటిస్తున్న పాన్ ఇండియా సినిమా. కాగా వాలెంటైన్స్ డే కానుకగా అర్జున్ సర్జా దర్శకత్వం వహిస్తున్న 'సీతా పయనం' (Sitha Payanam) మూవీ ఫిబ్రవరి 14న రాబోతోంది. ఈ సినిమాలో అర్జున్ కుమార్తె ఐశ్వర్య హీరోయిన్ గా నటించింది. నిరంజన్ హీరోగా నటిస్తున్న ఈ మూవీలో ధృవ సర్జా, సత్య రాజ్, ప్రకాశ్‌ రాజ్, అర్జున్ కీలక పాత్రలను పోషిస్తున్నారు.

Updated Date - Jan 01 , 2026 | 04:45 PM