సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

ఇసైజ్ఞానికి జన్మదిన శుభాకాంక్షల వెల్లువ

ABN, Publish Date - Jun 03 , 2026 | 01:45 PM

సంగీత దిగ్గజం ‘ఇసైఙ్ఞాని’ ఇళయరాజా తన 83వ పుట్టిన రోజు వేడుకలను మంగళవారం ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జోసెఫ్‌ విజయ్‌తో పాటు ప్రముఖులెందరో శుభాకాంక్షలు తెలిపారు.

Ilaiyaraaja

సంగీత దిగ్గజం ‘ఇసైఙ్ఞాని’ ఇళయరాజా (Isaignani Ilaiyaraaja) తన 83వ పుట్టిన రోజు వేడుకలను మంగళవారం ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జోసెఫ్‌ విజయ్‌తో పాటు మాజీ ముఖ్యమంత్రులు ఎంకే స్టాలిన్‌, ఎడప్పాడి కె.పళనిస్వామి, అగ్రనటుడు కమల్‌ హాసన్‌, ప్రముఖ సంగీత దర్శకుడు దేవీశ్రీ ప్రసాద్‌ వంటి అనేకమంది సినీ, రాజకీయ ప్రముఖులు బర్త్‌డే విషెస్‌ చెప్పారు. 1943, జూన్‌ 2వ తేదీ తేని జిల్లా పన్నాపురంలో రామస్వామి, చిన్నతాయమ్మల్‌ అనే దంపతులకు జన్మించిన డేనియల్‌ రాసయ్య అలియాస్‌ ఙ్ఞానదేశికన్‌ అలియాస్‌ ఇళయరాజా తన 83వ పుట్టిన రోజు వేడుకలను జరుపుకున్నారు.


కోడంబాక్కంలోని ఇళయరాజా మ్యూజిక్‌ స్టూడియోలో ఇళయరాజాను పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానులు స్వయంగా కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఇదిలావుంటే, సీఎం విజయ్‌ (CM Vijay) తన ట్వీట్‌లో ‘‘ఇళయరాజాకు పుట్టిన రోజు శుభాకాంక్షలు. తేని జిల్లా పన్నాపురం అనే గ్రామంలో జన్మించిన ఆయన.. ‘అన్నకిళి’ చిత్రంతో సంగీత దర్శకుడిగా ప్రవేశం చేసి, ప్రపంచ ప్రఖ్యాత సింఫనీ సంగీతంతో సహా అనేక విజయాలు సాధించి సంగీత ప్రపంచానికి కిరీటంగా నిలిచారు. మీ సంగీతం రాబోయే తరాలకు మార్గదర్శకంగా, స్ఫూర్తిగా నిరంతరం ప్రతిధ్వనించాలని కోరుకుంటున్నాను. తమిళులకు గర్వకారణమైన మీకు మా ప్రేమ, గౌరవంతో పుట్టిన రోజు శుభాకాంక్షలు’’ అంటూ పేర్కొన్నారు.


మాజీ సీఎం స్టాలిన్‌ చేసిన ట్వీట్‌లో.. ‘‘సంగీతంతో శాశ్వతంగా ఏలే సంగీతకారుడికి పుట్టిన రోజు శుభాకాంక్షలు. సంగీతకారుడిపై ఉన్న గౌరవంతో దివంగత కలైంజర్‌ తన పుట్టిన రోజును ఒక రోజు ముందుగానే మార్చుకున్నారు. ఆ నాయకుడే ఇళయరాజాకు ‘ఇసెజ్ఞాని’ అనే బిరుదు ప్రదానం చేశారు. ‘అన్నకిళి’ నుంచి ‘సింఫనీ’ వరకు రాజా సంగీతం కొనసాగాలి. రాజు ఎల్లప్పుడూ రాజే’ అని పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి:

‘పెద్ది’ పోరాటానికి తెలంగాణలోనూ లైన్ క్లియర్! పెరిగిన టికెట్ల ధరలు

NBK 111: ‘నో మోర్‌ వింటేజ్‌, ఓన్లీ న్యూ ఏజ్‌’.. సరికొత్త అవతారంలో బాలయ్య

Blast Zone : అర్జున్ సర్జా బ్లాస్ట్ జోన్ మూవీ రివ్యూ

Updated Date - Jun 03 , 2026 | 01:45 PM