సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Jananayagan: విజయ్ ఆఖరి చిత్రం పై చర్చలు

ABN, Publish Date - Jan 01 , 2026 | 06:43 PM

విజయ్ దళపతి నటించి ప్రతిష్టాత్మక చిత్రం 'జననాయగన్' పై భారీ చర్చ నడుస్తోంది. ఈ వింత వాదన అటు విజయ్ ఫ్యాన్స్‌ను, ఇటు బాలయ్య అభిమానులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

ప్రస్తుతం సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒకటే చర్చ.. అదే దళపతి విజయ్ నటిస్తున్న ఆఖరి చిత్రం జననాయగన్. కోలీవుడ్ చరిత్రలోనే అత్యంత భారీ అంచనాలు ఉన్న ఈ ప్రాజెక్ట్ గురించి రోజుకో కొత్త వార్త వైరల్ అవుతోంది. అయితే ఎన్నో రోజుల నుంచి సోషల్ మీడియాలో వినిపిస్తున్న ఒక వింత వాదన అటు విజయ్ ఫ్యాన్స్‌ను, ఇటు బాలయ్య అభిమానులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అదేంటంటే.. జననాయగన్ సినిమా, మన నందమూరి బాలకృష్ణ సూపర్ హిట్ చిత్రం భగవంత్ కేసరికి రీమేక్ అని..


విజయ్ తన సినీ కెరీర్‌కు జననాయగన్‌ సినిమాతో స్వస్తి చెప్పి, పూర్తిస్థాయిలో రాజకీయాల్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అందుకే ఈ ప్రాజెక్ట్‌ను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. హెచ్. వినోద్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాపై ఎన్నో విమర్శలు వచ్చాయి, షూటింగ్ ఆలస్యంతో పాటు, రిలీజ్‌ వాయిదా అవుతుందనే రూమర్స్ కూడా వినిపించాయి. కానీ వీటన్నింటికీ తనదైన శైలిలో కౌంటర్ ఇస్తూ విజయ్ టీమ్ ముందుకు వెళ్తోంది. ఒక రాజకీయ నాయకుడికి ఉండాల్సిన లక్షణాలు, ప్రజల పక్షాన నిలబడే ఒక నాయకుడి కథగా ఇది ఉండబోతోందని సమాచారం. అయితే అసలు చర్చ ఇక్కడే మొదలైంది. ఈ సినిమా టీజర్, విడుదలైన సాంగ్స్ చూస్తుంటే తెలుగులో ఘనవిజయం సాధించిన భగవంత్ కేసరి ఛాయలు స్పష్టంగా కనిపిస్తున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. బాలయ్య, శ్రీలీల మధ్య సాగే ఎమోషనల్ బాండింగ్ తరహాలోనే జననాయగన్‌ సినిమాలో కూడా విజయ్‌-మమితా బైజు మధ్య ఉండే సెంటిమెంట్ ప్రధానంగా ఉండబోతోందట. దీనితో పాటు సమాజానికి ఒక మంచి సందేశం ఇచ్చే అంశాలు కూడా ఇందులో పుష్కలంగా ఉన్నాయని టాక్.

ఈ రీమేక్ వార్తలపై అటు భగవంత్ కేసరి టీమ్ కానీ, ఇటు జననాయగన్ మేకర్స్ కానీ ఇప్పటివరకు పెదవి విప్పలేదు. దర్శకుడు హెచ్. వినోద్‌ను ఈ విషయంపై ప్రశ్నించినప్పుడు, ఆయన చాలా చాకచక్యంగా సమాధానం దాటవేస్తున్నారు. ఇది విజయ్ సినిమా, ఆయన ఇమేజ్‌కు తగ్గట్టుగా ఉంటుంది అని చెబుతూ సైడ్ అయిపోతున్నారు. ఒకవేళ ఇది నిజంగా రీమేక్ అని ముందే ప్రకటిస్తే, సినిమాలోని ఒరిజినాలిటీ దెబ్బతింటుందని చిత్ర యూనిట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. బాలయ్య కెరీర్‌లో భగవంత్ కేసరి ఎంతటి విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే. నేషనల్ అవార్డు కూడా దక్కించుకున్న ఆ సినిమా ఫ్లేవర్‌తో విజయ్ తన ఆఖరి చిత్రాన్ని మలిస్తే.. అది ఖచ్చితంగా బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తుంది అనడంలో సందేహం లేదు. మరోవైపు విజయ్ ఫ్యాన్స్ మాత్రం అది రీమేకా లేక స్ట్రయిట్ మూవీనా అనే విషయాలను పట్టించుకోవడం లేదు. తమ అభిమాన హీరోను చివరిసారిగా వెండితెరపై చూసి కేకలు వేయడానికి సిద్ధమవుతున్నారు.

Read Also: Anasuya Bharadwaj: అన‌సూయ వ‌న్స్‌మోర్‌.. భ‌ర్త‌తో జ‌లకాలాట‌లు, చుంబ‌నాలు! ఫొటోలు వైర‌ల్‌

Read Also: Powerstar Pawan Kalyan: పవన్ సినిమా రామ్ తాళ్ళూరికే!

Updated Date - Jan 01 , 2026 | 07:26 PM