BKU: ‘బెత్లహేమ్ ఫ్యామిలీ యూనిట్’కు గుడ్ న్యూస్..

ABN , Publish Date - Sep 05 , 2026 | 04:32 PM

మలయాళ బ్లాక్‌బస్టర్ ‘బెత్లహేమ్ ఫ్యామిలీ యూనిట్’ సినిమాకు ఎదురైన సమస్యకు పరిష్కారం దొరికింది. 

మలయాళ బ్లాక్‌బస్టర్ ‘బెత్లహేమ్ ఫ్యామిలీ యూనిట్’ (Bethlehem Kudumba Unit) సినిమాకు ఎదురైన సమస్యకు పరిష్కారం దొరికింది. నివిన్ పౌలీ(nivin Pauly), మమితా బైజు (Mamitha baiju) ప్రధాన పాత్రల్లో నటించిన ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ఓనమ్ పండగ సందర్భంగా ఆగస్టు 21న మలయాళంలో విడుదలైంది. ఇప్పటికే  ప్రపంచవ్యాప్తంగా రూ.230 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. తెలుగు వెర్షన్ ఈ నెల 4న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.  ఓటీటీ డీల్ కారణంగా తొలుత తెలుగు, తమిళ వెర్షన్స్  విడుదలకు పివిఆర్, ఇనాక్స్, సినీ పోలీస్(PVR, INOX, Cinepolis) కొన్ని షరతులు విధించి విడుదలను ఆపింది.

అయితే ఇప్పుడు ఓటీటీ విండోను పొడిగించడంతో ఈ సమస్య పరిష్కారమైంది. ఇప్పుడు   పివిఆర్, ఇనాక్స్, సినీ పోలీస్ లోనూ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. దీంతో ఈ సినిమా తెలుగు వెర్షన్ వసూళ్లు మరింత మెరుగుపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ‘ప్రేమలు’ చిత్రాన్ని తెరకెక్కించిన గిరీష్ ఏడీ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. దిలీష్ పోతన్, ఫహద్ ఫాజిల్, శ్యామ్ పుష్కరన్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంలో సంగీత్ ప్రతాప్, సురేష్ కృష్ణ, వినయ్ ఫోర్ట్, రోషన్ షణవాస్, శ్యామ్ మోహన్, షమీర్ ఖాన్ కీలక పాత్రల్లో నటించారు. విష్ణు విజయ్ సంగీతం అందించారు. తెలుగులో కూడా ఈ చిత్రానికి చక్కని ఆదరణ దక్కింది. 

ALSO READ:

Vishwambhara: OTT డీల్‌ కోసమే ఎదురుచూపులు.. డీల్‌ లాక్ అయితే రిలీజ్ డేట్‌ ఫిక్స్!

ఇత‌నే నా ల‌వ‌ర్‌.. ఫ్యాన్స్‌కు షాకిచ్చిన ప్ర‌ముఖ తెలుగు యూట్యూబ‌ర్‌

Biggboss 10: బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10.. హౌస్‌లోకి వెళ్లేది వీళ్లేనా?

Updated Date - Sep 05 , 2026 | 04:52 PM