Ajith Kumar: తమిళస్టార్ అజిత్‌కు మాతృ వియోగం..
ABN, Publish Date - May 30 , 2026 | 10:19 AM
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ ఇంట విషాదం చోటు చేసుకుంది. ఆయనకు మాతృవియోగం కలిగింది.
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ ఇంట విషాదం చోటు చేసుకుంది. ఆయనకు మాతృవియోగం కలిగింది. అజిత్ తల్లి మోహిని మణి (85) కన్నుమూశారు. వృద్ధాప్యసమస్యతో బాధపడుతున్న ఆమె శనివారం ఉదయం చెన్నైలోని స్వగృహంలో తుదిశ్వాస విడిచారు.
ప్రస్తుతం అజిత్ దుబాయ్‌లో ఉన్నారు. తల్లి మరణ వార్త తెలుసుకుని చెన్నైకు బయలు దేరారని, ఆయన చెన్నైకు చేరుకోగానే అంత్యక్రియలు జరుగుతాయని సన్నిహితులు చెబుతున్నారు. మూడేళ్ల క్రితమే అజిత్ తండ్రి మరణించారు. ఆ సమయంలోనే ఆయన ఎంతో భావోద్వేగానికి లోనయ్యారు.
అజిత్ తల్లి మృతి పట్ల చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు నటీనటులు సోషల్ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
మెకానికల్ ఇంజనీర్ అవుతానని.. నాన్నకి అబద్ధం చెప్పా: రామ్ చరణ్
అరుదైన పిక్.. సూపర్‌స్టార్ రజనీకాంత్ ‘కండక్టర్’ ఐడీ కార్డ్!
NBK111: బాలయ్య గ్యాంగ్‌స్టర్ లుక్.. ముంబై అడ్డాగా వేట!
యూపీలో పౌల్ట్రీ బిజినెస్.. భూమి పూజతోనే బండ్ల గణేష్ పరార్.. ఎందుకంటే?