త్రిష: జోరుమీదున్న చెన్నై చంద్రం
ABN, Publish Date - Feb 26 , 2026 | 08:32 AM
గత రెండు దశాబ్దాలకు పైగా చిత్రపరిశ్రమలో హీరోయిన్‌గా రాణిస్తూ, చెన్నై చంద్రంగా గుర్తింపు పొందిన త్రిష వరుస చిత్రాల్లో బిజీగా ఉన్నారు.
గత రెండు దశాబ్దాలకు పైగా చిత్రపరిశ్రమలో హీరోయిన్‌గా రాణిస్తూ, చెన్నై చంద్రంగా గుర్తింపు పొందిన త్రిష (Trisha) వరుస చిత్రాల్లో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఆమె నటించిన చిత్రాలు వరుసగా విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. మణిరత్నం ‘థగ్ లైఫ్’ తర్వాత తాజాగా సూర్య సరసన ‘కరుప్పు’లో త్రిష (Karuppu) నటించారు. ఈ చిత్రానికి ఆర్‌జే బాలాజీ దర్శకుడు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై రూపొందింది. ఏప్రిల్‌లో విడుదలకానుంది.
అలాగే, తెలుగులో చిరంజీవి సరసన 'విశ్వంభర', మలయాళంలో మోహన్‌లాల్‌తో కలిసి నటించిన చిత్రం కూడా ఈ వేసవిలోనే విడుదల కానుంది. వీటితో పాటు తమిళంలో మరో రెండు మూడు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు త్రిష. వయసు పెరిగే కొద్దీ అనేక మంది హీరోయిన్లు అవకాశాలను కోల్పోతుంటే త్రిషకు మాత్రం వరుసబెట్టి సినిమా అవకాశాలు వస్తుండటం గమనార్హం.
ALSO READ: డ్రాగన్‌లో.. అక్కినేని వారసుడు? యవ్వారం.. మాములుగా లేదుగా
ఫస్ట్ తెలుగు.. ఆ తర్వాతే హిందీ! బాలీవుడ్ సినిమాలపై.. టాలీవుడ్ స్టార్స్ అల్టిమేటం
అయ్యో.. ప్రియాంక 'వారణాసి' స్టోరీ లీక్ చేసిందిగా!