సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Radha Case: రూ.46 కోట్ల చెక్‌ మోసం కేసు.. సీసీబీ విచారణకు నటి రాధ హాజరు

ABN, Publish Date - Oct 01 , 2026 | 07:26 AM

ప్రముఖ సినీ నటి రాధ చేసిన ఫిర్యాదు ప్రస్తుతం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

ప్రముఖ సినీ నటి రాధ (Actress Radha) చేసిన ఫిర్యాదు ప్రస్తుతం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. తన సోదరి అంబిక (Ambika) బ్లాంక్‌ చెక్కులను దొంగిలించి, వాటిని దుర్వినియోగం చేస్తూ ఏకంగా రూ.46 కోట్ల మేర (Cheque Fraud Case) మోసం చేసేందుకు ప్రయత్నించారని రాధ ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై ఆమె పోలీస్‌ కమిషనర్‌కు ఫిర్యాదు చేయగా.. కేసును సెంట్రల్‌ క్రైమ్‌ బ్రాంచ్‌ (CCB) పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసు విచారణలో భాగంగా నటి రాధ పోలీసుల ఎదుట హాజరయ్యారు. CCB అధికారులు ఆమెను సుమారు మూడు గంటల పాటు  ప్రశ్నించారు. బ్లాంక్‌ చెక్కులు ఎప్పుడు, ఎక్కడ ఉంచారు? అవి తన వద్ద నుంచి ఎలా మాయమయ్యాయి? ఆ చెక్కులను ఎవరు ఉపయోగించారు? రూ.46 కోట్లకు సంబంధించిన లావాదేవీలతో తనకు ఉన్న సంబంధం ఏమిటి? వంటి అంశాలపై పోలీసులు రాధ నుంచి వివరాలు సేకరించినట్లు తెలిసింది. 

తనకు తెలియకుండా తన చెక్కులను ఉపయోగించి భారీ మొత్తానికి సంబంధించిన లావాదేవీలను సృష్టించేందుకు ప్రయత్నించారని రాధ తన ఫిర్యాదులో పేర్కొన్నట్లు సమాచారం. ముఖ్యంగా తన సోదరి అంబికపైనే ఆమె అనుమానాలు వ్యక్తం చేశారు. బ్లాంక్‌ చెక్కులను తీసుకుని వాటిని దుర్వినియోగం చేశారన్నది రాధ ఆరోపణ. అయితే ఈ ఆరోపణలకు సంబంధించి పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. రాధ ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్న అంశాలు, చెక్కులకు సంబంధించిన పత్రాలు, బ్యాంకు లావాదేవీలు, సంతకాలు తదితర వివరాలను CCB అధికారులు పరిశీలిస్తున్నారని కోలీవుడ్ మీడియా చెబుతోంది. అలాగే ఫిర్యాదులో ప్రస్తావించిన వ్యక్తుల పాత్రపైనా పోలీసులు దృష్టి సారించినట్లు తెలుస్తోంది.

తాజా విచారణ అనంతరం ఈ కేసులో తదుపరి చర్యలకు పోలీసులు సిద్ధమవుతున్నారు. రాధ సోదరి అంబికతో పాటు ఆమె సోదరుడు మల్లికార్జునను కూడా విచారించేందుకు CCB పోలీసులు సమన్లు జారీ చేయనున్నట్లు సమాచారం. వారి వాంగ్మూలాలను నమోదు చేసిన తర్వాత చెక్కుల వ్యవహారం, వాటి వినియోగం, రూ.46 కోట్లకు సంబంధించిన ఆరోపణలపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. 

ఇవి కూడా చదవండి:

జానీ మాస్టర్‌కు ఫిల్మ్ ఫెడరేషన్ షాక్: AIFEC సమావేశంలో కీలక తీర్మానం

Raashii Khanna: షారుఖ్ ఖాన్‌లా.. ఒక వారమైనా బతకాలనుంది

బాలయ్య అభిమానులకు గూస్‌బంప్స్ న్యూస్.. ఇక ఆప‌డం క‌ష్ట‌మే!

Updated Date - Oct 01 , 2026 | 07:42 AM