థియేటర్స్ నుంచి ఓటీటీకి త్రిమూర్తులు ట్రాన్స్‌ఫర్.. ఎందులో చూడొచ్చంటే

ABN , Publish Date - Jul 17 , 2026 | 06:16 PM

వడ్డే జిష్ణు సమర్పణలో వడ్డే క్రియేషన్స్ బ్యానర్ పై వడ్డే నవీన్ హీరోగా, నిర్మాతగా తెరకెక్కిన చిత్రం ‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’. ఈ సినిమా ఈ శుక్రవారం నుంచి ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది.

Transfer Trimurthulu OTT

వడ్డే నవీన్ (Vadde Naveen) రీ ఎంట్రీ చిత్రం ‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’ (Transfer Trimurthulu 2026) ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. వడ్డే జిష్ణు సమర్పణలో వడ్డే క్రియేషన్స్ బ్యానర్ పై వడ్డే నవీన్ హీరోగా, నిర్మాతగా తెరకెక్కిన చిత్రం ‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’. కమల్ తేజ నార్ల దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో వడ్డే నవీన్‌, రాశి సింగ్ (Rashi Singh), శిల్పా తులస్కర్, వివేక్ రఘువంశీ, రఘుబాబు, శివన్నారాయణ, వడ్లమాని శ్రీనివాస్, జ్వాలా కోటి, దేవి ప్రసాద్ తదితరులు ముఖ్య పాత్రల్ని పోషించారు. ఈ మూవీ జూన్ 19న థియేటర్లలో విడుదలై మంచి స్పందననే రాబట్టుకుంది. ఇప్పుడీ చిత్రం థియేట్రికల్ రన్ పూర్తి చేసుకుని, ఓటీటీ స్ట్రీమింగ్‌ (Transfer Trimurthulu OTT)కు వచ్చేసింది.


‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’ చిత్రం జీ 5 ఓటీటీ (Zee5 OTT)లో ఈ శుక్రవారం (జూలై 17) నుంచి అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం ఓటీటీలో ఈ చిత్రానికి మంచి ఆదరణ లభిస్తున్నట్లుగా తెలుస్తోంది. థియేటర్లలో మిస్ అయిన వారంతా ఈ చిత్రాన్ని ఓటీటీలో చూసేందుకు ఇంట్రస్ట్ చూపిస్తుండటంతో.. ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’ ఇక్కడ మంచి ఆదరణను రాబట్టుకుంటోంది. దీంతో చిత్రయూనిట్‌ కూడా చాలా హ్యాపీగా ఉంది.


ఈ చిత్ర కథ విషయానికి వస్తే.. త్రిమూర్తులు (వడ్డే నవీన్) నిజాయతీ గల కానిస్టేబుల్‌. భార్య లక్ష్మీ (రాశీ సింగ్‌). వాళ్ళకో పాప. ఇలా చిన్న కుటుంబం అతనిది. 10 ఏళ్ల సర్వీస్‌లో 55 సార్లు ట్రాన్స్‌ఫర్‌ అవుతాడు. అతని తండ్రి శ్రీనివాసులు (దేవి ప్రసాద్) కూడా నిజాయతీ గల పోలీస్‌. ఆయన బాటలోనే నీతి-నిజాయతీలతో ముందుకు సాగాలనుకుంటాడు. అలా అరకులోని ఓ పోలీస్‌ స్టేషన్‌కు ట్రాన్స్‌ఫర్‌ కాగా.. అక్కడ ఓ ప్రియమ్మ అనే యువతి మానభంగంకు సంబంధించిన ఎఫ్‌ఐఆర్‌ కాపీ దొరుకుతుంది. దానిని ఫైల్‌ చేసింది త్రిమూర్తులు తండ్రే! అసలు 20 ఏళ్లుగా ఆ కేసు పక్కన పడటానికి కారణం ఏంటి? దీని వెనకున్నది ఎవరు? ముఖ్యమంత్రి కమల (శిల్ప తులస్కర్‌)కు, ఈ కేసుకు ఉన్న సంబంధం ఏంటి? అసలు ప్రియమ్మ బతికుందా లేదా? ఈ కేసును త్రిమూర్తులు ఎలా చేధించారు? అనేది కథ.

ఇవి కూడా చదవండి:

ఐశ్వర్య రాజేష్ సుకుమారి షాక్ ఎలా ఉందంటే.. 

The Odyssey Review: క్రిస్టోఫర్ నోల‌న్.. ది ఒడిస్సీ మూవీ రివ్యూ

సీఎం విజయ్ పాలనపై వరలక్ష్మి శరత్‌కుమార్ షాకింగ్ పోస్ట్..

Updated Date - Jul 17 , 2026 | 06:17 PM