సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

నెట్‌ఫ్లిక్స్‌లో అన్న - అమెజాన్‌లో తమ్ముడు.. దుమ్మురేపుతున్నారు

ABN, Publish Date - Oct 05 , 2026 | 07:34 PM

అన్నదమ్ములు ఓటీటీలో దుమ్మురేపుతున్నారు. ఎవరా అన్నదమ్ములు అని అనుకుంటున్నారా? ఇంకెవరు కోలీవుడ్ స్టార్ హీరోస్ సూర్య అండ్ కార్తీ.

Karthi and Suriya

అన్నదమ్ములు ఓటీటీలో దుమ్మురేపుతున్నారు. ఎవరా అన్నదమ్ములు అని అనుకుంటున్నారా? ఇంకెవరు కోలీవుడ్ స్టార్ హీరోస్ సూర్య (Suriya) అండ్ కార్తీ (Karthi). అవును, వీరిద్దరూ హీరోలుగా నటించిన సినిమాలు ఓటీటీలో పోటీ పడి మరి ఆదరణను రాబట్టుకుంటున్నాయి. సూర్య హీరోగా వచ్చిన ‘విశ్వనాధ్ అండ్ సన్స్’ (Vishwanath and Sons) చిత్రం థియేటర్లలోనే కాకుండా ఓటీటీలోనూ మంచి ఆదరణను రాబట్టుకుంటోన్న విషయం తెలిసిందే. మరోవైపు సూర్య తమ్ముడు కార్తీ నటించిన ‘సర్దార్ 2’ (Sardar 2) కూడా తాజాగా ఓటీటీలోకి వచ్చి మంచి స్పందనను రాబట్టుకుంటోంది. దీంతో అన్నదమ్ములిద్దరూ ఓటీటీలలో ప్రభంజనం సృష్టిస్తున్నారు.


వరుస హిట్స్‌తో..

‘వీరభద్రుడు’, ‘విశ్వనాధ్ అండ్ సన్స్’ చిత్రాలతో వరుస సక్సెస్‌లను అందుకున్న సూర్య.. ప్రస్తుతం టాప్ హీరోగా తన సత్తా చాటుతున్నారు. అంతకు ముందు వరుస పరాజయాలతో ఉన్న సూర్యకు ఈ రెండు సినిమాలు కాస్త రిలీఫ్‌ని ఇచ్చాయి. మరీ ముఖ్యంగా ‘విశ్వనాధ్ అండ్ సన్స్’ చిత్రం థియేటర్లలో, ఓటీటీలో కూడా అద్భుతమైన సక్సెస్ అందుకోవడంతో.. ప్రస్తుతం కోలీవుడ్ టాప్ హీరోల రేసులో నెంబర్ వన్ ప్లేస్‌లోకి ఆయన వచ్చేశారు. ‘విశ్వనాధ్ అండ్ సన్స్’ చిత్రం ఇప్పటికీ నెట్‌ఫ్లిక్స్‌ (Netflix)లో టాప్‌లో ట్రెండ్ అవుతోంది.


థియేటర్లలో ఫట్.. ఓటీటీలో టాప్

కార్తీ, పీఎస్ మిత్రన్ కాంబోలో భారీ అంచనాల మధ్య వచ్చిన ‘సర్దార్ 2’ థియేటర్లలో తీవ్ర నిరాశ పరిచింది. అయితే రిలీజైన కేవలం మూడు వారాలకే అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)లోకి వచ్చిన ఈ సినిమా, అక్కడ మాత్రం ఊహించని రెస్పాన్స్ దక్కించుకుంటోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్రైమ్ వీడియోలో టాప్ 1 స్థానంలో ట్రెండ్ అవుతూ ఆడియన్స్‌ను విశేషంగా ఆకట్టుకుంటోంది. వెండితెరపై ఫ్లాపైన ఈ స్పై థ్రిల్లర్‌‌కు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై ఇంత తక్కువ సమయంలోనే ఈ రేంజ్ ఆదరణ దక్కడం విశేషం.

ఇవి కూడా చదవండి:

డీప్‌ఫేక్‌లు, ఆన్‌లైన్ వేధింపులపై విష్ణు మంచు కీలక నిర్ణయం

అలాంటి కొటేషన్స్ వేసి.. ఇలా తగ్గావ్ ఏంటి బండ్లన్నా?

నర్తకిగా పూజిత పొన్నాడ.. ఫస్ట్ లుక్ అదిరింది

Updated Date - Oct 05 , 2026 | 07:34 PM