సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

ఒళ్లు జ‌ల‌ద‌రింప‌జేసే థ్రిల్ల‌ర్‌.. ఫ్రం కొత్త సీజ‌న్ వ‌చ్చేస్తుంది! స్ట్రీమింగ్ ఎప్ప‌టినుంచంటే

ABN, Publish Date - Apr 12 , 2026 | 08:25 AM

ఇప్ప‌టికే మూడు భాగాలుగా వ‌చ్చి ప్ర‌పంచ‌వ్యాప్తంగా విశేష ఆద‌ర‌ణ సొంతం చేసుకున్న అమెరిక‌న్ సైన్స్‌ఫిక్స‌న్‌, మిస్ట‌రీ, హ‌ర్ర‌ర్ థ్రిల్ల‌ర్‌ వెబ్ సిరీస్ ఫ్రం.

from

ఇప్ప‌టికే మూడు భాగాలుగా వ‌చ్చి ప్ర‌పంచ‌వ్యాప్తంగా విశేష ఆద‌ర‌ణ సొంతం చేసుకున్న అమెరిక‌న్ సైన్స్‌ఫిక్స‌న్‌, మిస్ట‌రీ, హ‌ర్ర‌ర్ థ్రిల్ల‌ర్‌ వెబ్ సిరీస్ ఫ్రం (From). హెరాల్డ్ పెర్రినో (Harold Perrineau), కాటాలినా శాండినో మోరెనో (Catalina Sandino Moreno), ఇయాన్ బెయిలీ (Eion Bailey) ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించ‌గా జాన్ గ్రిప్పిన్ (John Griffin) ద‌ర్శక‌త్వం వ‌హించాడు. 2022లో ఎలాంటి అంచ‌నాలు లేకుండా సైలెంట్‌గా విడుద‌లైన ఈ వెబ్ సిరీస్ మౌత్ టాక్‌తో అత్య‌ధికంగా వీక్షించిన సిరీస్‌ల‌లో వ‌ర‌ల్డ్ టాప్‌టెన్‌లో స్థానం సంపాదించుకుంది.

ఇదిలాఉంటే.. ఇటీవ‌ల విడుద‌లైన‌ ఫంకీ సినిమా ప్ర‌మోష‌న్ల స‌మ‌యంలో హీరో విశ్వ‌క్ సేన్ ఓ సంద‌ర్భంలో మాట్లాడుతూ ఫ్రం సిరీస్ చూశాక‌ నిద్ర కూడా పోలేదు అంటూ చేసిన కామెంట్లు ఒక్క‌సారిగా వైర‌ల్ అయ్యాయి. అంతేగాక అప్ప‌టినుంచి తెలుగునాట ఈ సిరీస్‌కు ప్రాచుర్యం రావ‌డ‌మే గాక తెలుగు భాష‌లో అందుబాటులో లేకున్నా అనుహ్యంగా దీనిని వీక్షించే వారి సంఖ్య అమాంత రెట్టింపు అయింది. ఈ క్ర‌మంలోనే సిరీస్ అమెజాన్‌లో ట్రెండింగ్‌కు రాడ‌మే గాక స్టిల్ ఇప్ప‌టికీ టాప్ 10లో కొన‌సాగుతున్న‌ది.

అలాంటిది.. ఇప్పుడు ఈ సిరీస్‌లో 4వ భాగం సైతం స్ట్రీమింగ్ సిద్ధం కాగా తాజాగా శ‌నివారం ట్రైల‌ర్ విడుద‌ల చేశారు. ఈ ట్రైల‌ర్ చూస్తే గ‌త సీజ‌న్ల‌ను మించి ఉత్కంఠ క‌లిగించేలా, అభిమానుల‌ను అంచ‌నాలకు త‌గ్గ‌ట్టుగా భ‌యాన‌క స‌న్నివేశాల‌తో నింపేశారు. అయితే ఈ సీజ‌న్ 4 మ‌రో వారం రోజుల్లో ఏప్రిల్ 20 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) ఓటీటీలో స్ట్రీమింగ్ అవ‌నుంది. సో హ‌ర్ర‌ర్ సిరీస్ ఫ్యాన్స్ డోంట్ మిస్‌.

Updated Date - Apr 12 , 2026 | 11:57 AM