సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Rudravanam PS: ప్రతి ఎపిసోడ్ క్లైమాక్స్ లాగా ఉంటుంది..

ABN, Publish Date - Oct 29 , 2026 | 01:01 PM

‘రుద్రవనం పీఎస్’ సిరీస్ చూసి దర్శకుడు హరీష్ శంకర్ ఏమన్నారంటే..

‘రుద్రవనం పీఎస్’ (Rudravanam Ps) కథ నాకు తెలుసు. అవుట్ ఫుట్ కూడా చేశాను. నేను ఊహించిన దాని కంటే పెద్ద విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది' అని హరీష్ శంకర్ (Harish Shankar) అన్నారు. ఎల్లో ఫ్లవర్స్, శ్రీ చక్ర మూవీస్ బ్యానర్ల మీద రమేష్ పుప్పాల, సూర్యకాంతి నిర్మాతలుగా శశిధర్ మున్నంగి తెరకెక్కించిన  సిరీస్ ‘రుద్రవనం పీఎస్’. నరేష్ అగస్త్య, బెనర్జీ, శివ ఆలపాటి, సుగాలి సిలోని కీలక పాత్రధారులు. అక్టోబర్ 30 నుంచి  జీ5లో స్ట్రీమింగ్ కానుంది. బుధవారం గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బ్లాక్ బస్టర్ డైరెక్టర్ హరీష్ శంకర్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఆయన మాట్లాడుతూ  ‘‘మా నిర్మాత రమేష్ పుప్పాలను మళ్లీ ఇలా చూడటం ఆనందంగా ఉంది. ‘మిరపకాయ్’ టైంలో రమేష్ గారు నన్నెంతో ఎంకరేజ్ చేశారు.  వివేక్ గారి శ్రీమతి సూర్యకాంతి గారు ఈ సిరీస్‌తో నిర్మాతగా రానున్నారు. డైరెక్టర్ శశి గారు ఈ సిరీస్‌తో గొప్ప విజయాన్ని అందుకోవాలని కోరుకుంటున్నాను' అన్నారు. 

నరేష్ అగస్త్య మాట్లాడుతూ ‘‘పన్నెండేళ్ల క్రితం జీ5లో ‘పసుపు కుంకుమ’తో నా ప్రయాణం మొదలైంది. ఆ తర్వాత ‘పరువు’, ‘వికటకవి’ చేశాను. ఇప్పుడు ‘రుద్రవనం పీఎస్’ అంటూ రాబోతోన్నాం. శశితో నేను ఎన్నో కథల్ని చర్చించాను. అతని వద్ద ఇంకా చాలా గొప్ప గొప్ప కథలున్నాయి. శశి, అష్కర్ ఎన్నో నిద్రలేని రాత్రుల్ని గడిపారు. ఈ సిరీస్‌లో ప్రతీ ఒక్కరూ అద్భుతంగా నటించారు’ అని అన్నారు.

దర్శకుడు శశిధర్ మున్నంగి మాట్లాడుతూ .. ‘‘రుద్రవనం పీఎస్’ క్రైమ్, థ్రిల్లర్‌గా తెరకెక్కినది. ప్రతీ ఎపిసోడ్ ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. తెలుగులో గొప్ప క్రైమ్, థ్రిల్లర్‌గా నిలుస్తుంది' అని అన్నారు.

నిర్మాతలు మాట్లాడుతూ  ‘‘రుద్రవనం పీఎస్’లోని ప్రతీ ఎపిసోడ్ అద్భుతంగా, ఎక్కడా బోర్ కొట్టించకుండా ఉంటుంది. జీ5 టీం ఇచ్చిన సపోర్ట్‌ని మేం ఎప్పుడూ మర్చిపోలేం' మంచి అనుభూతి కలిగించే సిరీస్ ఇది' అన్నారు. 

Updated Date - Oct 29 , 2026 | 01:02 PM