ఓటీటీకి ‘ఓం శాంతి శాంతి శాంతిః’
ABN, Publish Date - Feb 23 , 2026 | 09:02 PM
తరుణ్ భాస్కర్ (Tharun bhasker), ఈషా రెబ్బా (Eesha rebba) జంటగా నటించిన చిత్రం ‘ఓం శాంతి శాంతి శాంతిః’ (Om Shanti Shanti Shantihi). ఏఆర్ సజీవ్ దీనిని తెరకెక్కించారు. ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.
తరుణ్ భాస్కర్ (Tharun bhasker), ఈషా రెబ్బా (Eesha rebba) జంటగా నటించిన చిత్రం ‘ఓం శాంతి శాంతి శాంతిః’ (Om Shanti Shanti Shantihi). ఏఆర్ సజీవ్ దీనిని తెరకెక్కించారు. గోపరాజు రమణ, బ్రహ్మాజీ, సురభి ప్రభావతి ముఖ్య పాత్రలు పోషించారు. జనవరి 30న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. మార్చి 4వ తేదీ నుంచి ఆహా వేదికగా ఇది స్ట్రీమింగ్ కానుంది. ఆహా సంస్థ ఓ పోస్టర్ ద్వారా ఈ విషయాన్ని తెలిపింది.
కథేంటంటే..
ప్రశాంతి (ఈషా రెబ్బ) మధ్య తరగతి కుటుంబంలో పుట్టి బాగా చదువుకుని ఉద్యోగం చేయాలనుకునే యువతి. అయితే ఇంట్లో నియమ నిబంధనలతో ఆమెకు ఎలాంటి స్వేచ్ఛ లేకుండా చేస్తారు. ప్రశాంతి కాలేజ్ లో లెక్చరర్ తో చిన్న ప్రేమాయణం నడపడంతో సడన్ గా చదువుకు ఫుల్ స్టాప్ పెట్టించి పెళ్ళి చేయాలనుకుంటారు కుటుంబ సభ్యులు. రాజమండ్రి సమీపంలో చేపల వ్యాపారం చేసే ఓంకార్ నాయుడు (తరుణ్ భాస్కర్)తో ప్రశాంతి పెళ్లి జరుగుతుంది. పెళ్లి తర్వాత కూడా చదువుకోవచ్చనే అంగీకారంతో ప్రశాంతి అతనితో మూడు ముళ్ళు వేయించుకుంటుంది. అయితే పెళ్ళి తర్వాత కూడా ప్రశాంతి జీవితం తను కోరుకున్నట్లు ఉండదు. ఓంకార్ నాయుడు మాటిమాటికీ తనపై చేయి చేసుకుంటుంటాడు. ఈ పంచాయతీని కన్నవారి ముందుంచితే సర్దుకుపోవాలంటూ సలహా ఇచ్చి పంపుతారు. ఇవన్నీ తట్టుకుంటూ, సమయం రాగానే ఎదురు తిరిగి భర్తకు బుద్ధి చెబుతుంది. దానికి ఓంకార్ వేసిన ప్లాన్ ఏంటి? వీరి బంధం సుఖంగా సాగిందా? లేదా? అన్నదే మిగతా కథ.