సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

బిగ్ బాస్ హిస్టరీలోనే బిగ్గెస్ట్ ప్రోమో.. ఒకే ఫ్రేమ్‌లో నలుగురు సూపర్‌స్టార్లు

ABN, Publish Date - Aug 31 , 2026 | 06:51 PM

ఎట్టకేలకు బిగ్ బాస్ మళ్లీ ప్రేక్షకుల ముందకు రానుంది. తెలుగులోనే కాకుండా ఈసారి నాలుగు భాషలలో ఒకేసారి బిగ్ బాస్ మొదలుకావడం సంచలనం సృష్టిస్తోంది.

Bigg Boss

ఎట్టకేలకు బిగ్ బాస్ (Biggboss) మళ్లీ ప్రేక్షకుల ముందకు రానుంది. తెలుగులోనే కాకుండా ఈసారి నాలుగు భాషలలో ఒకేసారి బిగ్ బాస్ మొదలుకావడం సంచలనం సృష్టిస్తోంది. దీనికోసం ఒకే ప్రచార చిత్రంలో నలుగురు అగ్ర కథానాయకులను ఒకే వేదికపైకి తీసుకొచ్చారు. సౌత్ ఇండియన్ బిగ్ బాస్ షోలకు హోస్ట్‌లుగా వ్యవహరిస్తున్న కింగ్ అక్కినేని నాగార్జున (తెలుగు), మోహన్ లాల్ (మలయాళం), కిచ్చా సుదీప్ (కన్నడ), విజయ్ సేతుపతి (తమిళ్)లు బిగ్ బాస్ కి హోస్ట్ లుగా వ్యహరిస్తోన్న విషయం తెల్సిందే. మునుపెన్నడూ లేనివిషంగా ఈసారి బిగ్ బాస్ ప్రోమోలో ఈ నలుగురు స్టార్ హీరోలు సందడి చేశారు.


ఇక ఈ ప్రోమోలో ఒక హోటల్ వెయిటర్ గదులు మారిపోవడంతో వేర్వేరు రాష్ట్రాల వంటకాలను ఒక్కో సూపర్ స్టార్ రూమ్‌కి మార్చి వడ్డిస్తాడు. పెసరట్టు, పుట్టు, సాంబార్ వడ ఒక్కొక్కరి దగ్గరకు వెళతాయి. ఆ వంటకాలను మార్చకుండా ఒకరి ఫుడ్ ని ఇంకొకరు టేస్ట్ చేసి సూపర్ ఉంది అని చెప్పడం చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. నాలుగు భాషలు.. నాలుగు ఇళ్ళు.. ఇక జరగబోయేది ఒకే రచ్చ అంటూ నలుగురు సూపర్‌స్టార్లు తమ తమ శైలిలో డైలాగ్స్ చెప్తూ అలరించారు. చివరికి ఈ గ్రాండ్ రియాలిటీ షో సౌత్ ఇండియా అంతటా సెప్టెంబర్ 6 నుండి ప్రారంభం కానుందని. డిస్నీ+ హాట్‌స్టార్‌లో 24x7 ప్రత్యక్ష ప్రసారంతో పాటు, స్టార్ మా, విజయ్ టీవీ, ఏషియానెట్, కలర్స్ కన్నడ ఛానెళ్లలో ప్రసారం కానుందని నలుగురు స్టార్ హీరోలు చెప్పడంతో ప్రోమో ముగిసింది. ఒకేసారి నలుగురు సూపర్‌స్టార్లను ఒకే ఫ్రేమ్‌లో చూసిన అభిమానులు పండగ చేసుకుంటున్నారు.


ప్రస్తుతం బిగ్ బాస్ పైనే అందరి కన్ను ఉంది. అన్నీ సీజన్స్ లా కాకుండా ఈసారి అన్నీ భాషల్లో సామాన్యులకు పెద్దపీట వేసినట్లు తెలుస్తోంది. అందుకే అన్నీ భాషల్లో కూడా అగ్నిపరీక్షను నిర్వహిస్తున్నారు. తెలుగులో ఈ అగ్నిపరీక్షకు నవదీప్, బిందు మాధవి, అభిజిత్ జడ్జిలుగా కనిపిస్తుండగా.. శ్రీముఖి హోస్ట్ గా వ్యవహరిస్తోంది. తెలుగులో 9 సీజన్స్ ఒక లెక్క 10 వ సీజన్ మరో లెక్క అని అంటున్నారు. మరి ఈసారి హౌస్ లోకి ఎలాంటి కంటెస్టెంట్స్ వస్తారు. వాళ్లెంత రచ్చ చేస్తారో చూడాలంటే ఇంకో వారం ఆగాల్సిందే.

Updated Date - Aug 31 , 2026 | 06:51 PM