సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

ఓటీటీకి.. అదిరిపోయే రీసెంట్ డార్క్‌ కామెడీ థ్రిల్ల‌ర్

ABN, Publish Date - Jul 10 , 2026 | 07:01 AM

గ‌త నెల‌లో త‌మిళ నాట థియేట‌ర్ల‌కు వ‌చ్చి సంచ‌ల‌న విజ‌యం సాధించిన డార్క్ కామెడీ థ్రిల్ల‌ర్‌ చిత్రం ప‌రిమ‌ళ అండ్ కో.

Parimala and Co

గ‌త నెల‌లో త‌మిళ నాట థియేట‌ర్ల‌కు వ‌చ్చి సంచ‌ల‌న విజ‌యం సాధించిన డార్క్ కామెడీ థ్రిల్ల‌ర్‌ చిత్రం ప‌రిమ‌ళ అండ్ కో (Parimala and Co). మ‌ల‌యాళ న‌టుడు జ‌య‌రాం (Jayaram), ఊర్వ‌శి (Urvashi), అనంతిక స‌నీల్ కుమార్ (Ananthika Sanilkumar), సంజ‌నా కృష్ణ‌మూర్తి (Sanjana Krishnamoorthy), తెలుగు న‌టుడు సంతోష్ శోభ‌న్ (Santosh Sobhan), యోగిబాబు (Yogi Babu) ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు. పాండి రాజ్ (Pandiraaj) ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రం జూన్ 5న ప్రేక్ష‌కుల ఎదుట‌కు వ‌చ్చి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఇప్పుడు ఈ మూవీ డిజిట‌ల్ స్ట్రీమింగ్‌కు వ‌చ్చేసింది.

అర్థిక ప‌ర‌మైన ఇబ్బందుల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్న ఓ మ‌ధ్య‌త‌ర‌గ‌తి కుటుంబం అనుకోకుండా ఓ హ‌త్య కేసులో చిక్కుకుంటుంది. దానిని దాచేందుకు, అందులోంచి బ‌య‌ట ప‌డేందుకు వారు చేసే ప్ర‌య‌త్నాలు దాని ద్వారా కొత్త‌గా ఎదుర‌య్యే చిక్కులతో మూవీ ఉత్కంఠ క‌లిగించేలా సాగుతుంది. చివ‌ర‌కు ఆ కుటుంబం ఎలా బ‌య‌ట ప‌డిందనే ఆస‌క్తిక‌ర‌మైన క‌థ‌క‌థ‌నాల‌తో ఎక్క‌డా బోర్ ఫీల్ రాకుండా ఆక‌ట్టుకుంటుంది. ఇప్పుడు ఈ చిత్రం జీ5 (ZEE 5) ఓటీటీలో త‌మిళంతో పాటు తెలుగు ఇత‌ర భాష‌ల‌లోనూ స్ట్రీమింగ్ అవుతుంది.మంచి డిఫ‌రెంట్ మూవీ చూడాల‌నుకునే వారు ఈ సినిమాను ఖ‌చ్చితంగా ప్ర‌య‌త్నం చేయ‌వ‌చ్చు.

Updated Date - Jul 10 , 2026 | 07:33 AM