సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

గుణశేఖర్‌ చిత్రం ఓటీటీలో...

ABN, Publish Date - Mar 30 , 2026 | 05:49 PM

గుణశేఖర్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన 'యుఫోరియా' మూవీ ఏప్రిల్ 2 నుండి ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ చిత్రానికి గుణశేఖర్‌ బెస్ట్ స్టోరీ రైటర్‌గా తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్ అందుకున్నారు.

Gunasekhar Euphoria Movie

ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ తాజా చిత్రం 'యుఫోరియా' ఫిబ్రవరి 6వ తేదీ థియేటర్లలో విడుదలైంది. మాదక ద్రవ్యాల మత్తులో యువత ఎలా తప్పుదారిలో ప్రయాణిస్తున్నారో ఈ సినిమా ద్వారా తెలియచేసే ప్రయత్నం గుణశేఖర్‌ చేశారు. 'ఒక్కడు' సినిమాలో హీరోయిన్‌గా నటించిన భూమిక... ఆ తర్వాత మరోసారి గుణశేఖర్‌ దర్శకత్వంలో ఇందులో కీలక పాత్ర పోషించారు. 'ధురంధర్‌' ఫేమ్‌ సారా అర్జున్ ఈ సినిమాలో యంగ్ ఐపీఎస్‌ ఆఫీసర్ పాత్రను పోషించారు. గౌతమ్‌ వాసుదేవ మీనన్ పోలీస్‌ కమీషనర్‌గా నటించిన ఈ సినిమాలో పలువురు కొత్త నటీనటులు యాక్ట్ చేశారు.


నీలిమా గుణ నిర్మించిన 'యుఫోరియా' సినిమా ఈటీవీ విన్‌లో స్ట్రీమింగ్ కాబోతోంది. ఏప్రిల్ 2 నుండి ఈ సినిమా ఈటీవీ విన్‌లో అందుబాటులో ఉంటుందని మేకర్స్ తెలిపారు. విశేషం ఏమంటే ఇటీవల తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్ అవార్డులలో గుణశేఖర్‌ 'యుఫోరియా' సినిమాకు గానూ బెస్ట్ స్టోరీ రైటర్ అవార్డును అందుకున్నారు.

Updated Date - Mar 30 , 2026 | 05:49 PM