సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Exam OTT: ఓటీటీకి.. అదిరిపోయే థ్రిల్ల‌ర్ వెబ్ సిరీస్‌! స్ట్రీమింగ్ ఎప్ప‌టినుంచంటే?

ABN, Publish Date - May 03 , 2026 | 01:25 PM

దుషార విజయన్, అదితి బాలన్ ప్రధాన పాత్రల్లో నటించిన తమిళ ఒరిజినల్‌ వెబ్‌ సిరీస్ ‘ఎగ్జామ్‌’.

Exam OTT

దుషార విజయన్ (Dushara Vijayan), అదితి బాలన్ (Aditi Balan) ప్రధాన పాత్రల్లో నటించిన ‘ఎగ్జామ్‌’ (Exam) తమిళ ఒరిజినల్‌ వెబ్‌ సిరీస్‌ ఈ నెల 15 నుంచి అమెజాన్‌ ప్రైమ్‌లో స్ట్రీమింగ్‌ కానునంది. జాతీయ అవార్డు గ్రహీత ఏ.సర్గుణం కథ సమకూర్చి దర్శకత్వం వహించిన ఈ వెబ్‌ సిరీస్‌ మొత్తం ఏడు ఎపిసోడ్లుగా రూపొందించారు. వాల్‌ వాచర్‌ ఫిల్మ్‌ పతాకంపై పుష్కర్‌, గాయత్రి సంయుక్తంగా నిర్మించారు.

సివిల్‌ సర్వీస్‌, గ్రూపు-1 వంటి ప్రధాన పోటీ పరీక్షల వెనుక జరిగే స్కామ్‌లను బహిర్గతం చేసే సందేశాత్మక కథాంశంతో తెరకెక్కించారు. తమిళం, తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ భాషలతో సహా ఇంగ్లీష్‌ సబ్‌ టైటిల్స్‌లో మరో 15 భాషల్లో రిలీజ్‌ చేస్తున్నారు. నిస్సహాయ స్థితిలో ఉండే ఒక యువతి.. తనకు వ్యతిరేంగా ఉన్న వ్యవస్థను ఎదిరించడం వల్ల కలిగే భావోద్వేగం, తద్వారా ఎదురయ్యే సమస్యలే ఈ వెబ్‌ సిరీస్‌ ప్రధాన కథాంశం. తాజాగా రిలీజ్ చేసిన ఈ వెబ్‌ సిరీస్‌ ట్రైలర్ ఆక‌ట్టుకునేలా మంచి థ్రిల్లింగ్ అంశాల‌తో గ్రిప్పింగ్‌గా సాగింది.

ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ, ‘ఎగ్జామ్‌’ కథ నేటి కాలానికి చాలా సందర్భోచితమైన కథ అని అన్నారు. పోటీ పరీక్షల భావోద్వేగ తీవ్రతను సంపూర్ణంగా వెండితెరపై ఆవిష్కరించి ఎంతో ఉత్కంఠభరితమైన డ్రామాగా‘సుళల్‌ - ది ఓర్టెక్స్‌’, ‘వదంతి - ది ఫేబుల్‌ ఆఫ్‌ వెలోని’ వంటి విజయవంతమైన వెబ్ సిరీస్‌ల తర్వాత ‘ఎగ్జామ్‌’ రూపొందించిన‌ట్లు తెలిపారు. ఈ నెల 15వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో (Amazon Prime Video) స్ట్రీమింగ్‌ కానుంది’ అని వివరించారు. ఇందులో సీనియర్‌ నటుడు అబ్బాస్ (Abbas) ఓ కీలక పాత్ర పోషించడం గమనార్హం.

Updated Date - May 03 , 2026 | 01:36 PM