Fahadh Faasil: అలా అడిగితే పారిపోయే ప్రయత్నం చేస్తా!

ABN , Publish Date - May 10 , 2024 | 09:07 PM

కొందరు సెలబ్రిటీలు నలుగురిలో ఫొటో దిగాలన్నా, మాట్లాడాలన్నా సిగ్గుపడుతుంటారు. అందుకే ఎవరైనా సెల్పీలు అడిగితే తిరస్కరిస్తారు. మలయాళ నటుడు ఫహద్‌ ఫాజిల్‌ (Fahadh Faasil) కూడా అదే కోవకు చెందినవారే!

Fahadh Faasil: అలా అడిగితే పారిపోయే ప్రయత్నం చేస్తా!

కొందరు సెలబ్రిటీలు నలుగురిలో ఫొటో దిగాలన్నా, మాట్లాడాలన్నా సిగ్గుపడుతుంటారు. అందుకే ఎవరైనా సెల్పీలు అడిగితే తిరస్కరిస్తారు. మలయాళ నటుడు ఫహద్‌ ఫాజిల్‌ (Fahadh Faasil) కూడా అదే కోవకు చెందినవారే! తన కొత్త సినిమా ‘ఆవేశం’ గత నెల 11న ప్రేక్షకుల ముందుకొచ్చింది. బాక్సాఫీసు వద్ద రూ. 150 కోట్లకుపైగా వసూళ్లు సాధించిన ఈ చిత్రం ప్రస్తుతం ఓటీటీ ‘అమెజాన్‌ ప్రైమ్‌ (amazon Prime Video) వీడియో’లో స్ట్రీమింగ్  అవుతోంది. ఈ సందర్భంగా పాల్గొన్న ప్రమోషన్ లో ప్రస్తుతం ఫొటోలకు పోజిలివ్వడం రాదని, అందుకే ఎవరైనా సెల్ఫీల కోసం వస్తే అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేస్తానని తెలిపారు. 

తన గురించి తెలిసిన అభిమానులు మాత్రం ఫొటోల కోసం చుట్టుముట్టరని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన తెలుగులో అల్లు అర్జున్  ‘పుష్ప 2’లో (Pushpa 2)నటిస్తున్నారు. పుష్ప పార్ట్‌-1లో భన్వర్‌సింగ్‌ షెకావతగా తనదైన శైలి నటనతో మెప్పించారు. ఇప్పుడు పుష్ప-2లో  అంతకుమించి పవర్‌ఫుల్‌గా కనిపిస్తారని చిత్ర
బృందం చెబుతోంది. అలాగే తమిళంలో రజనీకాంత్‌ ‘వేట్టయాన్‌’లో ఆయన కీలక పాత్ర పోషిస్తున్నారు.

Updated Date - May 10 , 2024 | 09:07 PM