తెలుగులోను.. ఓటీటీకి వచ్చేసిన లేటెస్ట్ తమిళ్ రొమాంటిక్ కామెడీ బ్లాక్ బస్టర్
ABN, Publish Date - Aug 28 , 2026 | 09:40 AM
ఇటీవల తమిళనాట థియేటర్లలో విడుదలై మంచి విజయం సాధించిన రొమాంటిక్ కామెడీ చిత్రం ‘అన్బే డయానా’ ఓటీటీకి వచ్చేసింది.
ఇటీవల తమిళనాట థియేటర్లలో విడుదలై మంచి విజయం సాధించిన రొమాంటిక్ కామెడీ చిత్రం ‘అన్బే డయానా’ (Anbe Diana). పరి ఎలవళగన్ (Pari Elavazhagan) స్వయంగా కథ రాసి, దర్శకత్వం వహించడంతో పాటు హీరోగా చేయగా, రమ్య రంగనాథన్ (Ramya Ranganathan) కథానాయికగా నటించింది. ఏపీ మాజీ మంత్రి, సీనియర్ నటి రోజా (Roja Selvamani) ప్రధాన పాత్ర పోషించారు. ఇప్పుడు ఈ సినిమా తెలుగులోనూ ఓటీటీ ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చింది.
కథ విషయానికి స్తే.. చెన్నైలోని పెరంబూర్ నేపథ్యంగా సాగే ఈ చిత్రం సాగుతుంది. సంప్రదాయాలకు కట్టుబడి ఉండే ఓ యువకుడి జీవితంలో చోటుచేసుకునే ఊహించని మలుపుతో ఏం జరిగిందనే పాయింట్ చుట్టూ సాగుతుంది. స్వేచ్ఛగా జీవించే ఓ ఆంగ్లో-ఇండియన్ యువతితో అతడు ప్రేమలో పడటంతో రెండు విభిన్న ప్రపంచాలు ఏకమవుతాయి. ఈ క్రమంలో కుటుంబంలో ఉండే అంచనాలు, తనకంటూ ఓ గుర్తింపు కోసం యువకుడు చేసే ప్రయాణం మధ్య ఎదురయ్యే సంక్లిష్టతలే ఈ కథలో ప్రధాన అంశాలుగా కనిపిస్తాయి.
ప్రేమ, కామెడీ, మన నెటివిటీకి, మన సంస్కృతి, కుటుంబ అనుబంధాల మేళవింపుగా రూపొందిన ఈ చిత్రం ఎక్కడా బోర్ అనే ఫీల్ రానివ్వకుండా చివరి వరకు మంచి కామెడీ పంచులతో సాగుతూ ఉంటుంది. ముఖ్యంగా రోజా పాత్ర ఈ మూవీకి ప్రధాన హైలెట్. కాగా ఇప్పుడు ఈ చిత్రం సోనీ లివ్ (Sony LIV) ఓటీటీ (OTT)లో తమిళంతో పాటు తెలుగు ఇతర ప్రధాన భాషల్లోనూ స్ట్రీమ్ అవుతుంది. మంచి ఫన్ ఫ్యామిలీ సినిమా చూడాలనుకునే వారు ఈ చిత్రంప ఐఓ లుక్ వేయవచ్చు.