Rare Pic: ఈ ముగ్గురు ముద్దుగుమ్మలు చిరుని ఏం చేద్దామనుకుంటున్నారో
ABN, Publish Date - Aug 14 , 2026 | 01:23 PM
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి సినీ ప్రస్థానంలో ఎన్నో మధుర జ్ఞాపకాలు, అరుదైన దృశ్యాలు దాగున్నాయి. వాటిలో ఒకటిగా ఈ పిక్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) సినీ ప్రస్థానంలో ఎన్నో మధుర జ్ఞాపకాలు, అరుదైన దృశ్యాలు దాగున్నాయి. ఆయన కెరీర్‌లో పీక్ స్టేజ్‌లో ఉన్న సమయంలో తోటి నటీనటులతో గడిపిన సరదా క్షణాలకు సంబంధించిన ఫోటోలు అప్పుడప్పుడు బయటకు వచ్చి అభిమానులను ఎంతగానో అలరిస్తుంటాయి. తాజాగా 80స్, 90స్ నాటి గోల్డెన్ డేస్‌కి సంబంధించిన ఒక అరుదైన, ఆసక్తికరమైన త్రోబ్యాక్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ సినీ లవర్స్ దృష్టిని విశేషంగా ఆకర్షిస్తోంది.
ఈ పిక్‌లో మెగాస్టార్ చిరంజీవి కూల్ అండ్ స్టైలిష్‌గా స్లీవ్‌లెస్ టీషర్ట్, ఫార్మల్ ట్రౌజర్స్ ధరించి కుర్చీలో ప్రశాంతంగా చిరునవ్వులు చిందిస్తూ కూర్చుని ఉండగా.. ఆయన వెనుక ఒకప్పటి స్టార్ హీరోయిన్లు సుమలత (Sumalatha), జయసుధ (Jayasudha), సుహాసిని (Suhasini) నిలబడి ఉన్నారు. ఆ ముగ్గురు ముద్దుగుమ్మలు ఒకరితో ఒకరు పోటీ పడుతూ.. చిరంజీవి వెనకాల సరదాగా కొంటె ఎక్స్‌ప్రెషన్స్ ఇస్తూ, నాలుకలు చాచి ఆయనను ఆటపట్టిస్తున్నట్లుగా కెమెరాకు పోజిచ్చారు. షూటింగ్ విరామ సమయంలో వీరంతా ఎంత సరదాగా సమయాన్ని గడిపేవారో ఈ ఒక్క క్లిక్ చూస్తేనే అర్థమవుతోంది.
చిరంజీవితో ఈ ముగ్గురు హీరోయిన్లకు ఉన్న కెమిస్ట్రీ టాలీవుడ్ చరిత్రలోనే ప్రత్యేకం. సుహాసినితో ‘ఆరాధన’, ‘మంచి దొంగ’.. సహజనటి జయసుధతో ‘ఇది కథ కాదు’, ‘మగధీరుడు’.. సుమలతతో ‘ఖైదీ’, ‘వేట’ వంటి ఎన్నో ఆల్‌టైమ్ బ్లాక్‌బస్టర్, క్లాసిక్ చిత్రాలు వీరి కలయికలో వచ్చాయి. ఒకే ఫ్రేమ్‌లో అప్పటి స్టార్ హీరో, టాప్ హీరోయిన్లు ఇంత నేచురల్ అండ్ ఫన్నీ మూడ్‌లో కనిపించడం చూసి మెగా ఫ్యాన్స్ తెగ మురిసిపోతున్నారు. ‘అప్పట్లో వీరి ఫ్రెండ్‌షిప్, ఆ బాండింగ్ వేరే లెవల్’ అంటూ నెటిజన్లు ఈ రేర్ పిక్‌ను సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ పిక్ టాక్ ఆఫ్ ది సోషల్ మీడియాగా దూసుకెళుతోంది.
ఇవి కూడా చదవండి:
వారంలోనే.. ఓటీటీలో హిస్టరీ క్రియేట్ చేసిన అఖిల్ ‘లెనిన్’
అగ్నిపరీక్షకు పిలిచి అవమానిస్తారా? నీకిదే నా శాపం: ఉప్పల్ బాలు
స్టేజ్‌పైనే డైరెక్టర్‌కు ‘ఐ లవ్ యూ’ చెప్పిన హీరోయిన్.. అంతా షాక్