స్టేజ్‌పైనే డైరెక్టర్‌కు ‘ఐ లవ్ యూ’ చెప్పిన హీరోయిన్.. అంతా షాక్

ABN , Publish Date - Aug 13 , 2026 | 09:43 PM

హవీష్, హాట్ బ్యూటీ కావ్య థాఫర్ జంటగా నటిస్తోన్న తాజా చిత్రం ‘నేను రెడీ’. ఔట్ అండ్ ఔట్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి త్రినాధరావు నక్కిన దర్శకత్వం వహిస్తున్నారు.

Kavya Thapar at Nenu Ready Event

హవీష్ (Havish), హాట్ బ్యూటీ కావ్య థాఫర్ జంటగా నటిస్తోన్న తాజా చిత్రం ‘నేను రెడీ’ (Nenu Ready). ఔట్ అండ్ ఔట్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి త్రినాధరావు నక్కిన (Thrinadha Rao Nakkina) దర్శకత్వం వహిస్తున్నారు. హార్నిక్స్ ఇండియా ఎల్‌ఎల్‌పీ బ్యానర్‌పై కోనేరు సత్యనారాయణ, నిఖిల కోనేరు నిర్మిస్తున్నారు. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన రెండు పాటలు మంచి స్పందనను రాబట్టుకోగా, తాజాగా ఈ సినిమాలోని మూడో పాటను మేకర్స్ గ్రాండ్‌గా విడుదల చేశారు. వరంగల్‌లో జరిగిన ఈ సాంగ్ లాంఛ్ కార్యక్రమంలో హీరోయిన్ కావ్య థాపర్, దర్శకుడు త్రినాధరావుకు స్టేజ్‌పైనే ‘ఐ లవ్ యూ’ చెప్పారు. ఆ వివరాల్లోకి వెళితే..


పాట విడుదల అనంతరం వేదికపై మాట్లాడేందుకు మైక్ అందుకున్న హీరోయిన్ కావ్య థాఫర్, చిత్ర యూనిట్‌తో ఉన్న తన అనుబంధాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆమె డైరెక్టర్ త్రినాధరావు నక్కినను ఉద్దేశించి ‘ఐ లవ్ యూ సర్’ అని పబ్లిగ్గా స్టేజ్‌పై చెప్పడంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ‘‘ఈ ప్రాజెక్టు ఇంత అద్భుతంగా వచ్చిందంటే దానికి కారణం త్రినాధరావు నక్కిన. ఆయనే ఈ సినిమాకి అసలైన బ్యాక్‌బోన్. కేవలం డైరెక్షన్ మాత్రమే కాకుండా ప్రతీ డిపార్ట్‌మెంట్‌ని దగ్గరుండి చూసుకున్న ఆల్‌రౌండర్ ఆయన. మీ సినిమాలో హీరోయిన్‌గా చేసినందుకు నాకు చాలా గర్వంగా ఉంది’’ అంటూ ఆయనపై కావ్య ప్రశంసల వర్షం కురిపించారు.


ఈ సినిమాలో తన పాత్రను పరిచయం చేస్తూ, తాను తెలంగాణ యాస మాట్లాడే పక్కా మాస్ అమ్మాయి పాత్రలో కనిపిస్తున్నట్లు కావ్య వెల్లడించారు. తన కెరీర్‌లో ఇప్పటివరకు చేసిన పాత్రలకు ఇది చాలా భిన్నమైనదని, ప్రేక్షకులు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారని అన్నారు. రాబోయే రోజుల్లో తెలుగు స్పష్టంగా నేర్చుకుని పూర్తిస్థాయిలో తెలుగులోనే ప్రసంగిస్తానని హామీ ఇచ్చారు. ప్రస్తుతం హీరోయిన్ కావ్య థాఫర్ డైరెక్టర్‌కు స్టేజ్‌పై ‘ఐ లవ్ యూ’ చెబుతూ ఆప్యాయత చూపించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

ఇవి కూడా చదవండి:

ఎక్కడ చూసినా నాగ్ నామ జపమే.. ఇంత యాక్టివ్ అయ్యారేంటి

కలిసొచ్చిన జానర్.. కామాక్షి భాస్కర్ల‌కు మరో హిట్ పడుతుందా

Rajinikanth: బాబోయ్.. ఆ స్పీడ్‌ ఏంటి తలైవా

Updated Date - Aug 13 , 2026 | 09:43 PM