సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

శ్రామిక ప్యానల్‌‌దే ఘనవిజయం.. అధ్యక్షునిగా మూడోసారి నాని

ABN, Publish Date - Aug 01 , 2026 | 06:32 PM

శ్రీకృష్ణానగర్‌లోని టీవి ఫెడరేషన్‌ కార్యాలయంలో తెలుగు టెలివిజన్‌ డిజిటల్‌ అండ్‌ ఓటీటీ టెక్నీషియన్స్‌ అండ్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌కి జరిగిన ఎన్నికలలో శ్రామిక ప్యానల్‌ నుంచి పోటీ చేసిన 20 మంది అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

Shramika Panel victory

శ్రీకృష్ణానగర్‌లోని టీవి ఫెడరేషన్‌ కార్యాలయంలో తెలుగు టెలివిజన్‌ డిజిటల్‌ అండ్‌ ఓటీటీ టెక్నీషియన్స్‌ అండ్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌కి జరిగిన ఎన్నికలలో శ్రామిక ప్యానల్‌ నుంచి పోటీ చేసిన 20 మంది అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రెసిడెంట్‌, జనరల్‌ సెక్రటరీ పోస్టులకు జరిగిన ఎన్నికల్లో శ్రామిక ప్యానల్‌ నుంచి అధ్యక్షునిగా పోటీ చేసిన కొయ్యలమూడి రాకేష్‌ (నాని), ప్రధాన కార్యదర్శిగా పుట్టా విజయ్‌కుమార్‌లు 95 శాతం ఓట్లు సాధించి ఘన విజయాన్ని అందుకున్నారు. తెలుగు టెలివిజన్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌ ఎన్నికల్లో ముచ్చటగా మూడోసారి అధ్యక్షునిగా విజయం సాధించారు రాకేష్‌ అండ్‌ టీమ్‌.


ఎలక్షన్‌ ఫలితాల్లో విజయం సాధించిన తర్వాత ఫెడరేషన్‌ అధ్యక్షుడు నాని (Koyyalamudi Rakesh) మాట్లాడుతూ.. 24 శాఖల్లో ఉన్న వర్కర్స్‌ ఫెడరేషన్‌లో దాదాపు 7000 మంది సభ్యులు విధులు నిర్వహిస్తున్నారు. ఈ ఎలక్షన్‌లో పోటీ చేసినప్పుడు మా అందరిది ఒకే ఎజెండా. మా 7000 మంది సభ్యుల్లో దురదృష్టవశాత్తు ఎవరైనా మరణిస్తే వారికి తక్షణం గంటలోపే లక్ష రూపాయల తక్షణ ఆర్థిక సాయాన్ని అందిస్తామని అన్నారు. ఈ ఎన్నికలు టీవీ అడహక్‌ కమిటీ చైర్మెన్‌ పి. మురళీ, వైస్‌ చైర్మన్‌ బి. మోహన్‌ రాజుల ఆధ్వర్యంలో జరుగగా.. హైకోర్టు అడ్వకేట్‌ కె.వి.ఎల్‌ నరసింహారావు చీఫ్‌ ఎలక్షన్‌ ఆఫీసర్‌గా వ్యవహరించారు.


ఏకగ్రీవంగా ఎన్నికైన అభ్యర్థుల్లో కె. నరేందర్‌ రెడ్డి వైస్‌ ప్రెసిడెంట్‌గా.. రమేష్‌ మాస్టర్, ఎస్‌.కె ఖుద్దూస్‌ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్స్‌గా.. కె. ఈశ్వర్, యం.వి.వి కృష్ణమూర్తి జాయింట్‌ సెక్రటరీలుగా.. బి. మహిపాల్, కె. మధు, పి. మురళీకృష్ణ, ఆర్‌.నాగరాజు ఆర్గనైజింగ్‌ సెక్రటరీస్‌గా.. ఎ. దేవి, డి. సందీప్‌ కుమార్, జి. సత్యనారాయణ మూర్తి, జి. శంకర్, టి. సత్యనారాయణ (సత్య మాస్టర్‌) ఈసీ మెంబర్స్‌గా ఎన్నిక కాగా, ఇంకా ఏ కరుణాకర్, బి. రాము, సి.హెచ్‌ కామేశ్వరరావు, కె. లోకేష్, పి. యామేష్‌ (చక్రి) ఈ ఎన్నికల్లో గెలుపొందారు.

ఇవి కూడా చదవండి:

‘వారణాసి’ తర్వాత జక్కన్న ప్లాన్ ఏంటి? చిన్న సినిమానా.. లేక

కొరియాలో షూట్ చేసినా ఎలాంటి కన్ఫ్యూజన్ ఉండదు: మెగా ప్రిన్స్

Lenin OTT: అయ్యగారి సినిమా ఈసారి ఆలస్యం కాకుండానే ఓటీటీకి..

Updated Date - Aug 01 , 2026 | 06:32 PM