Bengali Actress: ఎఫ్.ఐ.ఆర్. దాఖలు... మాట మార్చిన శ్రీలేఖ మిత్రా!

ABN , Publish Date - Jul 28 , 2026 | 12:39 PM

బెంగాలీ నటి శ్రీలేఖా మిత్ర వివాదం రోజు రోజుకూ ముదురుతోంది. కోల్ కతాలో జరిగిన నిరసన ర్యాలీలో శ్రీలేఖ మోదీని కించపరుస్తూ ప్రదర్శించిన పోస్టర్ ఆమెను చిక్కుల్లోకి నెడుతోంది.

Sreelekha Mitra

ఇటీవల కోల్ కతాలో విద్యార్థులు నీట్ కు వ్యతిరేకంగా జరిపిన ర్యాలీలో ప్రముఖ బెంగాలీ నటి శ్రీలేఖ మిత్రా ప్రదర్శించిన పోస్టర్ వివాదానికి తెర లేపింది. ప్రధాని మోదీని కించపరిచే విధంగా ఉన్న ఓ అసభ్యకరమైన పోస్టర్ ను ఆమె ర్యాలీలో ప్రదర్శించారు. దీనిపై బీజేపీ నాయకురాలు కేయా ఘోష్‌ ఆనందపూర్ పోలీస్ స్టేషన్ లో శ్రీలేఖ మిత్రాపై కేసు పెట్టారు. దాంతో పోలీసులు శ్రీలేఖపై ఎఫ్.ఐ.ఆర్. ను నమోదు చేశారు. కేవలం ఇక్కడే కాకుండా రాష్ట్రంలోని పలు పోలీస్ స్టేషన్లలో ఆమెపై కేసులు నమోదయ్యాయి. ఈ విషయంపై శ్రీలేఖ మిత్రా తాజాగా స్పందించారు.

నటి శ్రీలేఖ మిత్రా మాట్లాడుతూ, 'ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఉద్దేశపూర్వకంగా అవమానించే ఉద్దేశం నాకు లేదు. నేను ఒక ప్రత్యేక పోస్టర్ పట్టుకున్న ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నేను బీజేపీకి వ్యతిరేకంగా ఉండొచ్చు. కానీ నన్ను దేశద్రోహి అని పిలవడం హాస్యాస్పదం. అలాగే, ఆ పోస్టర్‌ను నేను ఉద్దేశపూర్వకంగా పట్టుకుని ఫోజ్ ఇచ్చానని అనుకోవడం కూడా తప్పే' అని అన్నారు.


ఆ రోజున విద్యార్థుల నిరసనలకు మద్దతుగా తాను రోడ్డెక్కానని, నిరసనకారులతో కలిసి పరుగెత్తుతున్న సమయంలో ఎవరో తన చేతిలో ఆ పోస్టర్ పెట్టారని ఆమె తెలిపారు. ఆ సమయంలో తాను రీడింగ్ గ్లాసెస్ ధరించకపోవడంతో పోస్టర్‌పై ఉన్న చిత్రాన్ని స్పష్టంగా చూడలేకపోయానని శ్రీలేఖ మిత్రా వివరణ ఇచ్చారు. తాను అప్పుడు కేవలం సన్ గ్లాసెస్ మాత్రమే పెట్టుకున్నానని, అదే సమయంలో పోలీసులు లాఠీ ఛార్జ్ చేయడంతో పోస్టర్ పై ఉన్నది ఏమిటో సరిగా చూసుకోకుండానే, హడావుడిగా ఫోటోలకు ఫోజులిచ్చానని అన్నారు.

అయితే శ్రీలేఖ మిత్ర వివరణ పట్ల బీజేపీ నేతలు సుముఖత వ్యక్తం చేయడంలేదు. ప్రధానిని అగౌరవ పర్చి, అవమానించిన శ్రీలేఖ మిత్రను వెంటనే అరెస్ట్ చేసి, చట్టపరమైన చర్యలు తీసుకొని, కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఒకవేళ ఆమెను అరెస్ట్ చేయకుండా కోర్టును ఆశ్రయిస్తామని హెచ్చరిస్తున్నారు. చూద్దాం... ఏం జరుగుతుందో!

ఇవి కూడా చదవండి:

బాక్సాఫీస్ బరిలో.. రెండు కుటుంబాలు.. నలుగురు హీరోలు! విజ‌యం.. ఎవ‌రికి ద‌క్కేనో

ఎన్టీఆర్ భుజానికి గాయం... ఎనిమిది వారాల విశ్రాంతి!

Updated Date - Jul 28 , 2026 | 12:40 PM