సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

హైదరాబాద్‌లో మెరిసిన శ్రీలీల.. చాలా ఛేంజ్ కనిపిస్తోందిగా!

ABN, Publish Date - Jul 17 , 2026 | 05:38 PM

ప్రస్తుతం శ్రీలీల ఫోకస్ మొత్తం బాలీవుడ్, కోలీవుడ్‌ పైనే ఉందని.. అందుకే హైదరాబాద్‌లో కూడా ఉండటం లేదంటూ ఈ మధ్య తెగ ప్రచారం నడుస్తోంది. ఇలా ప్రచారం చేస్తున్న వారందరికీ ఆమె షాకిచ్చింది.

Sreeleela at The Signature Silks Event

ఈ మధ్య శ్రీలీల (Sreeleela) తెలుగు సినిమాలు చేయడం లేదంటూ వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమె ఫోకస్ మొత్తం బాలీవుడ్, కోలీవుడ్‌ పైనే ఉందని.. అందుకే హైదరాబాద్‌లో కూడా ఉండటం లేదంటూ ఈ మధ్య తెగ ప్రచారం నడుస్తోంది. ఇలా ప్రచారం చేస్తున్న వారందరికీ షాక్ ఇస్తూ.. తాజాగా శ్రీలీల హైదరాబాద్‌లో మెరిసింది. అయితే, ఆమె హైదరాబాద్‌లో సందడి చేసింది సినిమా షూటింగ్ నిమిత్తం కాదు.. ‘ది సిగ్నేచర్ సిల్క్స్’ నూతన షోరూమ్‌ లాంచ్ కోసం ఆమె హైదరాబాద్‌లో ప్రత్యక్షమైంది.


అత్యుత్తమ సిల్క్ చీరలు, డిజైనర్ ఎథ్నిక్ వేర్, బ్రైడల్ కలెక్షన్స్, పండుగల ప్రత్యేక వస్త్రాలకు ప్రీమియం గమ్యస్థానంగా నిలిచే ‘ది సిగ్నేచర్ సిల్క్స్’ తన నూతన షోరూమ్‌ను మెట్రో పిల్లర్ నెం. 741, హైదరాబాద్ కెపిహెచ్‌బి‌లో శ్రీలీల చేతుల మీదుగా ఆవిష్కరించింది. ఈ కార్యక్రమంలో ఫ్యాషన్ అభిమానులు, శ్రేయోభిలాషులు, శ్రీలీల అభిమానులు పెద్ద ఎత్తున హాజరై సందడి చేశారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో డైరెక్టర్ ప్రకాశ్ సింగ్ గెహ్లాట్, మేనేజింగ్ డైరెక్టర్ నరేందర్ సింగ్ గెహ్లాట్ పాల్గొని అతిథులను ఆహ్వానించారు. సంప్రదాయ, ఆధునిక శైలుల సమ్మేళనంతో అత్యుత్తమ నాణ్యత కలిగిన వస్త్రాలను వినియోగదారులకు ఒకే వేదికపై అందించాలనేది తమ లక్ష్యమని ఈ సందర్భంగా వారు వివరించారు.

ఈ కార్యక్రమంలో శ్రీలీల మాట్లాడుతూ.. ది సిగ్నేచర్ సిల్క్స్ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలియజేశారు. షోరూమ్‌లో అందుబాటులో ఉన్న అద్భుతమైన సిల్క్ చీరలు, బ్రైడల్, డిజైనర్ కలెక్షన్లను ప్రశంసించారు. హైదరాబాద్‌లో సిల్క్ చీరలు, వివాహ వేడుకల దుస్తులు, పండుగల ప్రత్యేక వస్త్రాల కొనుగోలుకు ఈ షోరూమ్ ప్రముఖ గమ్యస్థానంగా ఎదగాలని ఆమె ఆకాంక్షించారు. ప్రస్తుతం ఈ షోరూమ్ లాంఛ్‌కు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


ఇక రీసెంట్‌గా వచ్చి సక్సెస్ అయిన ‘లెనిన్’ చిత్రంలో మొదట శ్రీలీలనే హీరోయిన్. అనూహ్యంగా ఆమె తప్పుకోవడంతో భాగ్యశ్రీ ఆ రోల్‌కి ఎంపికయ్యారు. దీంతో ఈ సినిమా శ్రీలీల మిస్ చేసుకుని మంచి ఛాన్స్ పోగొట్టుకుందంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఈ షోరూమ్ లాంచ్ వేడుకలో శ్రీలీల సరికొత్తగా కనిపించి.. అందరినీ అలరించింది. తన అందాలను, యాక్టింగ్‌ను మెరుగుపరుచుకునే క్రమంలో ఆమె ఉన్నట్లుగా, ఈ వేడుకలో ఆమెని చూసిన వారంతా అనుకుంటూ ఉండటం విశేషం.

ఇవి కూడా చదవండి:

The Odyssey Review: క్రిస్టోఫర్ నోల‌న్.. ది ఒడిస్సీ మూవీ రివ్యూ

సీఎం విజయ్ పాలనపై వరలక్ష్మి శరత్‌కుమార్ షాకింగ్ పోస్ట్..

బొకేలు ఎక్కువ వచ్చినా, తక్కువ వచ్చినా.. నాలో మార్పు రాలేదు: ఐశ్వర్య రాజేష్

Updated Date - Jul 17 , 2026 | 05:38 PM