Telugu Cinema: పుస్తకంగా దర్శకుడు శివ నాగేశ్వరరావు సినీ ప్రయాణం
ABN, Publish Date - Nov 29 , 2026 | 01:24 PM
ప్రముఖ దర్శకుడు శివ నాగేశ్వరరావు సినీ అనుభవాలు ‘శివుడి సినిమా ప్రయాణం’ పేరుతో పుస్తకంగా రానున్నాయి. అక్షజ్ఞ పబ్లికేషన్స్ ప్రచురిస్తున్న ఈ పుస్తకానికి రాంగోపాల్ వర్మ, సుకుమార్, తనికెళ్ల భరణి, చంద్రబోస్ ముందుమాటలు రాశారు.
సినిమా రంగం వడ్డించిన విస్తరి కాదు. ఇక్కడికి వచ్చిన వారంతా కెరీర్ ప్రారంభ దినాలలో కష్టనష్టాలను పంటి బిగువున భరించి, పట్టుదలతో ముందుకు సాగిన వారే. విసిగి వేసారి వెనక్కి వెళ్ళిపోయిన వారు కొందరైతే, లక్ష్య సాధనే ధ్యేయంగా శ్రమించి విజయపథంలో కొనసాగిన వారు మరికొందరు. ప్రముఖ దర్శకులు శివ నాగేశ్వరరావు రెండో కోవకు చెందిన వ్యక్తి.
1979లో సినిమా రంగం మీద మక్కువతో గుంటూరు నుంచి మద్రాస్ చేరిన శివ నాగేశ్వరరావు ఎంతోమంది సీనియర్ దర్శకుల దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేశారు. క్లాప్ బోయ్ గా కెరీర్ మొదలు పెట్టిన ఆయన 1993లో 'మనీ' సినిమాతో దర్శకులయ్యారు. ఈ సినీ ప్రయాణంలో ఎన్నో తీపి గురుతులు, మరెన్నో చేదు జ్ఞాపకాలు! వీటన్నింటినీ ఇటీవల శివ నాగేశ్వరరావు ఫేస్ బుక్ మాధ్యమంగా తెలియచేస్తూ వచ్చారు. సినిమాల తెరవెనుక విశేషాలను ఆయన ఆసక్తికరంగా రాయడంతో ఆ వ్యాసాలకు విశేష ఆదరణ లభించింది. దాంతో శివ నాగేశ్వరరావు సినిమా అనుభవాలను పుస్తక రూపంలో తీసుకు రావాలని అక్షజ్ఞ పబ్లికేషన్స్ సంకల్పించింది. 'శివుడి సినిమా ప్రయాణం' పేరుతో శివ నాగేశ్వరరావు సినిమాత్మ కధను సచిత్రంగా తీసుకురానుంది. ఈ పుస్తకానికి సినీ ప్రముఖులు రాంగోపాల్ వర్మ, సుకుమార్, తనికెళ్ళ భరణి, చంద్రబోస్ ముందు మాట రాశారు. త్వరలో హైదరాబాద్‌లో ప్రారంభమయ్యే బుక్ ఎగ్జిబిషన్ నాటికి 'శివుడి సినిమా ప్రయాణం' పుస్తకాన్ని అందుబాటులోకి తీసుకొస్తామని 'అక్షజ్ఞ' వెంకట్ తెలిపారు.
ఇవి కూడా చదవండి:
Nithya Menen: యంత్రంలా ఆగకుండా పనిచేయలేను.. కృత్రిమంగా నటించలేను
Naga Chaitanya: ఆ సమయంలో అసలు నేనేం చేస్తున్నానో అర్థం కాలేదు..
‘బేబీ’ కథ వివాదం.. సాయి రాజేష్, SKNలకు హైకోర్టు నోటీసులు!