మారేడుపల్లిలో.. రవితేజ సినిమా షూటింగ్! జీహెచ్ఎంసీ పేరుతో బెదిరింపులు
ABN, Publish Date - Nov 26 , 2026 | 06:50 AM
రవితేజ సినిమా షూటింగ్‌కు అనుమతుల పేరిట రూ.30 వేలు డిమాండ్ చేస్తూ సినిమా యూనిట్‌ను బెదిరించిన హరిపై మారేడుపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు.
జీహెచ్ఎంసీ ఉద్యోగినంటూ అనుమతుల పేరిట సినిమా యూనిట్‌ను బెదిరించిన ఓ వ్యక్తిపై మారేడుపల్లి పోలీ సులు కేసు నమోదు చేశారు. ఎస్ఐ తిరుపతి తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 23, 24 తేదీల్లో రవితేజ నటిస్తున్న ఓ సినిమా మాటింగ్‌కు (Ravi Teja Movie Shooting) సంబంధించిన సన్నివేశాలను వెస్ట్ మారేడుపల్లి నెహ్రూ నగర్ కాలనీలోని ఓ పురాతనమైన ఇంట్లో చేస్తున్నారు.
దీంతో ఓ మాజీ కార్పొరేటర్ భర్త అనుచరుడైన రెజిమెంటల్ బజార్‌కు చెందిన హరి (35) ఈ నెల 24న సినిమా యూనిట్ మేనేజ్మెంట్ వద్దకు వెళ్లి తాను జీహెచ్ఎంసీ (GHMC) ఉద్యోగినని, షూటింగ్ నిర్వహణకు అనుమతులు తీసుకోకపోతే జీహెచ్ఎంసీకి ఛలానా కట్టాలని, లేదంటే తనకు రూ.30 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు.
తాము ఇప్పటికే జీహెచ్ఎంసీ, పోలీస్ శాఖలకు ఛలానాలు కట్టి అనుమతులు తీసుకున్నామని సినీ మేనేజ్‌మెంట్ ప్రతినిధులు చెప్పినప్పటికీ బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో యూనిట్ ప్రతినిధులు హరిపై మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రాథమిక వివరాలు సేకరించిన పోలీసులు కేసు నమోదు చేశారు.