సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

రాజుబాబు స్మారక అవార్డుల ప్రదానం

ABN, Publish Date - Jun 14 , 2026 | 08:00 AM

టీవీ, సినీ నటుడు రాజుబాబు జయంతి వేడుకలను ఎఫ్.ఎన్.సి.సి.లో నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులకు రాజుబాబు స్మారక పురస్కారాలు అందచేశారు.

Rajubabu Awards

'ప్రముఖ గుణచిత్ర నటుడు రాజుబాబు జయంతిని ప్రతీ సంవత్సరం ఆయన మిత్రులు జరపటం ఎంతో సముచితంగా ఉందని, ఇది అందరికీ మార్గదర్శనం కావాలని పలువురు వక్తలు ఆశాభావం వ్యక్తం చేశారు. టీవీ, సినీ నటుడు రాజుబాబు 69వ జయంతి సందర్భంగా స్మార్థక అవార్డుల కార్యక్రమం శనివారం నాడు ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ లో జరిగింది. వివిధ రంగాలలో నిష్ణాతులైన వ్యక్తులను ఈ సందర్భంగా సత్కరించారు.

తెలుగు దేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు టి. డి. జనార్దన్ పురస్కారాన్ని స్వీకరించిన అనంతరం మాట్లాడుతూ 'రాజుబాబు జయంతిని ఆయన మిత్రులు జరపటం ఎంతో ఆనందంగా ఉందని, ఇది ప్రతీ వారికీ ఆదర్శం కావాల'ని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఎన్టీ రామారావును గుర్తుచేసుకుంటూ తెలుగు జాతికీ, తెలుగు నేలకు విశేషమైన సేవలందించిన ఎన్టీఆర్ పేద ప్రజల అభ్యున్నతి కోసం ఎన్నో పధకాలని ప్రవేశ పెట్టారని, అలాగే మహిళలకు ఆస్తిలో హక్కును కల్పించారని జనార్దన్‌ అన్నారు. తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత పిల్లలు గుర్తు చేసుకోవటంతో పాటు వారిని స్మరిస్తూ ఇలాంటి కార్యక్రమాలు చేయాలని జనార్దన్ హితవు పలికారు.


దర్శకుడు బి. గోపాల్ మాట్లాడుతూ 'రాజుబాబు జయంతి వేడుకలకు ప్రతి సంవత్సరం తాను హాజరవుతున్నానని, ఇలాంటి కార్యక్రమాలు సమాజానికి అవసరమ'ని చెప్పారు. మరో దర్శకుడు వీరశంకర్ మాట్లాడుతూ 'రాజుబాబు జయంతి వేడుకలు ఆయన మిత్ర బృందం ఎంతో స్ఫూర్తిధాయకంగా నిర్వహిస్తున్నారని, అందుకే తాను కూడా తప్పనిసరిగా ఈ వేడుకలలో పాల్గొంటున్నాన'ని తెలిపారు.

దర్శకులు ఎ. కోదండ రామిరెడ్డి, ప్రదీప్, కాదంబరి కిరణ్ కుమార్, ఎస్. పి. నాగేశ్వరరావు, కోట శంకర రావు, తోట భావనారాయణ, గీతా భాస్కర్, మేఘన ముసునూరి, శశాంక్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాకాని బ్రహ్మం స్వాగతం పలకగా, మల్లికార్జున రావు కార్యక్రమాన్ని నిర్వహించారు. రమేష్ వందన సమర్పణ చేశారు.

ఇవి కూడా చదవండి:

వంగా ‘స్పిరిట్’ స్కెచ్‌కు బాక్సాఫీస్ షేక్ అవ్వడం ఖాయం!

1.6 కిలోల వెండి ఖడ్గం.. మొక్కు తీర్చుకున్న సీఎం విజయ్!

వారెవ్వా అనిల్‌ రావిపూడి.. నీ చర్యలు ఊహాతీతం!

Updated Date - Jun 14 , 2026 | 08:01 AM