పబ్లిగ్గా బుగ్గగిల్లిన ఆకతాయి.. షాకైన హీరోయిన్.. వీడియో వైరల్
ABN, Publish Date - Oct 03 , 2026 | 09:33 AM
పబ్లిక్ ఈవెంట్లకు వెళ్లినప్పుడు సినీ తారలకు అభిమానుల నుంచి విచిత్రమైన, కొన్నిసార్లు ఇబ్బందికరమైన అనుభవాలు ఎదురవుతూనే ఉంటాయి. తాజాగా కన్నడ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ స్టార్ హీరోయిన్‌కు అలాంటి పరిస్థితే ఎదురైంది.
పబ్లిక్ ఈవెంట్లకు వెళ్లినప్పుడు సినీ తారలకు అభిమానుల నుంచి విచిత్రమైన, కొన్నిసార్లు ఇబ్బందికరమైన అనుభవాలు ఎదురవుతూనే ఉంటాయి. తాజాగా కన్నడ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ స్టార్ హీరోయిన్, ‘డింపుల్ క్వీన్’ రచితా రామ్‌కు (Rachita Ram) ఓ బహిరంగ కార్యక్రమంలో ఊహించని షాకింగ్ అనుభవం ఎదురైంది. సెల్ఫీ తీసుకునే నెపంతో వచ్చిన ఓ యువకుడు ఏకంగా ఆమె బుగ్గ గిల్లడంతో సదరు హీరోయిన్ బిత్తరపోయింది.
అసలేం జరిగిందంటే..
కర్ణాటకలో జరిగిన ఓ బహిరంగ ఈవెంట్‌కు నటి రచితా రామ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వేదికపై ఆమె ప్రసంగిస్తూ అభిమానులను ఉత్సాహపరిచారు. అనంతరం కార్యక్రమం ముగించుకుని తిరిగి వెళ్తుండగా, ఆమెతో సెల్ఫీలు, ఫొటోలు దిగేందుకు అభిమానులు పెద్ద ఎత్తున ఎగబడ్డారు. అభిమానులను నిరాశపరచడం ఇష్టం లేక ఆమె వారితో ఓపిగ్గా ఫొటోలకు ఫోజులిస్తూ ముందుకు సాగారు. ఈ క్రమంలోనే క్యాప్ ధరించి వచ్చిన ఓ యువకుడు రచితా రామ్‌తో కలిసి సెల్ఫీ తీసుకున్నాడు. ఫొటో దిగడం పూర్తయిన మరుక్షణమే.. అతను ఏమాత్రం సంకోచించకుండా పబ్లిగ్గా నటి రెండు బుగ్గలను చేతులతో పట్టుకున్నాడు. ఆ ఆకతాయి హఠాత్తుగా చేసిన ఈ అనుచిత చర్యతో రచితా రామ్ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఏం జరుగుతుందో అర్థంకాక ఆమె తన చేతితో బుగ్గను తడుముకుంటూ అవాక్కయి చూశారు. వెంటనే అప్రమత్తమైన బౌన్సర్లు, సెక్యూరిటీ సిబ్బంది ఆ యువకుడిని పక్కకు నెట్టివేశారు. అంతటి ఇబ్బందికర పరిస్థితి ఎదురైనప్పటికీ, రచితా రామ్ తన హుందాతనాన్ని కోల్పోకుండా సంయమనం పాటిస్తూ, అక్కడున్న మిగతా అభిమానులతో చిరునవ్వుతోనే ముందుకు కదిలారు.
సోషల్ మీడియాలో నెటిజన్లు ఫైర్!
ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఈ వీడియో చూసిన నెటిజన్లు, సినీ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అభిమానం పేరుతో మహిళా సెలబ్రిటీల వ్యక్తిగత ప్రైవసీని ఉల్లంఘించడం, ఇలా అసభ్యంగా ప్రవర్తించడం ఏమాత్రం సరికాదని మండిపడుతున్నారు. పబ్లిక్ ఈవెంట్లలో హీరోయిన్లకు భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
8 వారాల తర్వాతే ఓటీటీల్లోకి సినిమా: డిస్ట్రిబ్యూటర్ల తీర్మానం
RC17: చరణ్, సుక్కు మూవీ.. స్టార్ట్ కాకుండానే డెడ్‌లైన్!
రాజమౌళి బ్రాండ్‌కు అక్కడ ట్రబుల్!