చిన్న నిర్మాతలకు అండగా మన ప్యానెల్!

ABN , Publish Date - Sep 05 , 2026 | 05:54 PM

ఆదివారం నిర్మాతల మండలి ఎన్నికలు జరుగుబోతున్నాయి. తాజాగా మన ప్యానెల్ అభ్యర్థులు ప్రోగ్రెసివ్ ప్యానెల్ చేసిన హామీలపై విమర్శలు గుప్పించారు.

Prasanna - Chadalawada - C Kalyan

ఆదివారం తెలుగు నిర్మాతల మండలి ఎన్నికలు జరుగ బోతున్నాయి. ఈ సందర్భంగా ప్రధానమైన పోటీ రెండు ప్యానెల్స్ మధ్య నెలకొంది. సి. కళ్యాణ్‌ నేతృత్వంలోని మన ఛానెల్ ఒకటి కాగా గిల్డ్ నిర్మాతల ఆధ్వర్యంలోని ప్రోగ్రెసివ్‌ ప్యానెల్ రెండోది. నిర్మాత సి.కళ్యాణ్‌ ఇప్పటికే అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. దాంతో మిగిలిన పోస్టులకు ఎన్నికలు జరుగుతున్నాయి. శనివారం మన ప్యానెల్ అభ్యర్థులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.

సి. కళ్యాణ్‌ ఈ సందర్భంగా మాట్లాడుతూ, 'నిన్న ప్రోగ్రెసివ్‌ ప్యానెల్‌ వాళ్ళు కొన్ని హామీలు, వాగ్దానాలు చేసినవి చూసాం. మేము అలాంటివి ఏం చేయలేదు. ఎందుకంటే ఇక్కడ మేం చేసిన పని అందరికీ కనిపిస్తోంది. నిర్మాతల మండలికి గండి కొట్టి గిల్డ్ కు తీసుకుని వెళ్ళి ఆ సొమ్మును అనుభవిస్తుంది ఎవరు? అనేది అందరికీ తెలుసు. గత కార్యవర్గంలో మా వాళ్ళు 7 మంది ఉంటే అవతలి వాళ్ళు 16 మంది ఉన్నారు. గత రెండున్నర ఏళ్లగా మీరేం చేశారు? నిన్న వచ్చి సేవలు చేస్తాం అంటున్నారు. ఇప్పటి వరకు మరి ఏం చేశారు? ఎన్నికల సమయంలో వచ్చి హామీలు ఇచ్చి, వాగ్దానాలు చేస్తున్నారు. నిజానికి నిర్మాతల మండలి ఒక ఛారిటీ. నేను మద్రాస్ నుండి ఇక్కడ వరకు వచ్చాను. చరిత్ర తెలుసుకుని మాట్లాడాలి. గిల్డ్ వారు నిర్మాతల మండలికి అన్యాయం చేశారు. చిన్న సినిమాలు వల్ల 40 వేల మంది బ్రతుకుతున్నారు. వారి కోసం ఉన్నదే నిర్మాతల మండలి. చిన్న నిర్మాతలను, చిన్న సినిమాలను సపోర్ట్ చేయడానికి మన ప్యానెల్ ఉంది. గిల్డ్ లో ఉన్న వాళ్ళు కోట్ల రూపాయల సొమ్మును దుర్వినియోగం చేశారు కాని మేము అలా చేయలేదు. మేము దుర్వినియోగం చేశాం అంటే అది ప్రూవ్ చేయమని నిరూపించమనండి. అలానే వాళ్ళు చిన్న సినిమాలకు చాలా అన్యాయం చేశారు. మేము పేద నిర్మాతలకు ఇచ్చే డబ్బు గిల్డ్ లో వారిలో వారే పంచుకున్నారు' అని ఆరోపించారు.


చదలవాడ శ్రీనివాసరావు మాట్లాడుతూ, '1990లో చెన్నై నుండి హైదరాబాద్ కు వచ్చినప్పుడు ఇప్పుడు పరిశ్రమలో ఉన్న పెద్ద నిర్మాతలు లేరు. అక్కడ నుండి ఇక్కడకు పరిశ్రమ వచ్చేందుకు నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బాగా సపోర్ట్ చేశారు. కళ్యాణ్ గారు ఉన్నత వ్యక్తి. ప్రసన్న గారు నిలకడగా ఉండే వ్యక్తి. నిర్మాతలకు అంత తెలుసు. నిర్మాతల సొమ్మును గిల్డ్ కు తీసుకుని వెళ్ళిపోయారు. కౌన్సిల్ లో మేం అధికారంలోకి వచ్చాక అన్ని అందరికీ అర్థం అయ్యేలా చేస్తాం. 'మన ప్యానెల్'ను పూర్తి మెజారిటీతో గెలిపించండి. చిత్ర పరిశ్రమను ధర్మంగా ముందుకు నడిపే బాధ్యత మాది. పరిశ్రమలో అందరూ బావుండేలా చూసుకుంటాం' అని హామీ ఇచ్చారు.


IMG-20260905-WA0034.jpg

తుమ్మల ప్రసన్నకుమార్ మాట్లాడుతూ, 'గత ఎన్నికల సమయంలో వారు మమ్మల్ని మోసం చేశారు. చాలా మంది చిన్న నిర్మాతలకు నేను అండగా నిలబడ్డాను. ఇన్సూరెన్స్ ఎవరెవరికి ఇచ్చారో క్లియర్ గా ఉంది. గిల్డ్ వారి సమస్యలు కూడా ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ తీర్చింది. ఎన్నో పెద్ద సినిమాలకు కూడా మేము అండగా నిలబడ్డాము. చిత్ర పరిశ్రమ కోసం, చిన్న సినిమాల కోసం, చిన్న నిర్మాతల కోసం పని చేసేది మేము. రాబోయే రోజుల్లో ప్రభుతాల పరంగా పాజిటివ్ గా ముందుకు వెళ్తున్నాం' అని అన్నారు. మరి ఈ రెండు ప్యానెల్స్ లో ఎవరెవరికి నిర్మాతలు పట్టం కడతారో తెలుసుకోవాలంటే... ఆదివారం సాయంత్రం వరకూ వేచి ఉండాలి.

ALSO READ:

Vishwambhara: OTT డీల్‌ కోసమే ఎదురుచూపులు.. డీల్‌ లాక్ అయితే రిలీజ్ డేట్‌ ఫిక్స్!

ఇత‌నే నా ల‌వ‌ర్‌.. ఫ్యాన్స్‌కు షాకిచ్చిన ప్ర‌ముఖ తెలుగు యూట్యూబ‌ర్‌

Biggboss 10: బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10.. హౌస్‌లోకి వెళ్లేది వీళ్లేనా?

Updated Date - Sep 05 , 2026 | 05:55 PM