Peddi Movie: దసరా బరిలో ‘పెద్ది’ కూడా..
ABN, Publish Date - Oct 04 , 2026 | 03:35 PM
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా.. టాలెంటెడ్ డైరెక్టర్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కిన బ్లాక్‌బస్టర్ చిత్రం ‘పెద్ది’ టెలివిజన్ ప్రీమియర్‌కు సిద్ధమైంది.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Mega Power Star Ram Charan) హీరోగా, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ (Janhvi Kapoor) హీరోయిన్‌గా.. టాలెంటెడ్ డైరెక్టర్ బుచ్చిబాబు సానా (Buchibabu Sana) దర్శకత్వంలో తెరకెక్కిన బ్లాక్‌బస్టర్ చిత్రం ‘పెద్ది’ (Peddi). థియేటర్లలో బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తూ ప్రపంచవ్యాప్తంగా రూ. 400 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించిన ఈ చిత్రం, ఆ తర్వాత డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లోనూ విశేష ఆదరణ దక్కించుకుంది. ఇప్పుడు ఈ సూపర్ హిట్ చిత్రం బుల్లితెరపై ప్రేక్షకులను అలరించేందుకు ముస్తాబైంది.
దసరా స్పెషల్‌గా గ్రాండ్ ప్రీమియర్!
ఈ చిత్రానికి సంబంధించిన తెలుగు శాటిలైట్ హక్కులను ప్రముఖ ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్ ‘జీ తెలుగు’ సొంతం చేసుకుంది. దసరా పండుగ కానుకగా అక్టోబర్ 11 (ఆదివారం) సాయంత్రం 5:00 గంటలకు ‘పెద్ది’ సినిమాను వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌గా ప్రసారం చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. పండుగ స్పెషల్‌గా ఇంట్లోనే కూర్చుని ఈ రూరల్ ఎమోషనల్ అండ్ యాక్షన్ డ్రామాను వీక్షించే అవకాశం లభించడంతో మెగా అభిమానులు ఖుషీ అవుతున్నారు.
హిందీలోనూ సందడి.. ‘సోనీ మాక్స్’లో ప్రసారం
తెలుగుతో పాటు హిందీ ఆడియన్స్‌ను అలరించేందుకు కూడా రంగం సిద్ధమైంది. ‘పెద్ది’ హిందీ వెర్షన్ వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ అక్టోబర్ 25న రాత్రి 8:00 గంటలకు ప్రముఖ హిందీ మూవీ ఛానల్ ‘సోనీ మాక్స్’ (Sony Max)లో ప్రసారం కానుంది. థియేటర్లలో, ఓటీటీలో అద్భుత రెస్పాన్స్‌తో దుమ్మురేపిన ‘పెద్ది’.. ఇప్పుడు టెలివిజన్ రంగంలోనూ ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి. పండుగ స్పెషల్‌గా రాబోతోన్న ఈ చిత్రం బుల్లితెరపై ఏ స్థాయిలో టీఆర్‌పీ రేటింగ్స్‌ను కొల్లగొట్టి సరికొత్త రికార్డులను నమోదు చేస్తుందోనని ఇండస్ట్రీ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా నిర్మించారు.
ఇవి కూడా చదవండి:
ఆ సినిమా నాకిచ్చిన దైవవరం.. సినీ శ్వాస సింగీతం: ‘ఆదిత్య 369’ నిర్మాత
Varanasi: మహేష్ ‘రుద్ర’ పాత్రపై రాజమౌళి షాకింగ్ కామెంట్స్
Drishyam 3: అక్షయ్ ఖన్నా తప్పిదం.. జైదీప్‌కు జాక్‌పాట్