నారా రోహిత్ తనయుడి నామకరణం...
ABN, Publish Date - Sep 22 , 2026 | 02:36 PM
నారా రోహిత్, శిరీష దంపతులకు జూన్ 23న కొడుకు పుట్టిన విషయం తెలిసిందే. తాజాగా అతనికి నామకరణం జరిగింది.
యువ నటుడు నారా రోహిత్, నటి శిరీషా దంపతులకు కొంతకాలం క్రితం కొడుకు పుట్టాడు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తమ్ముడు రామ్మూర్తి నాయుడు కొడుకైన నారా రోహిత్ వివాహ వేడుకలను చంద్రబాబే దగ్గరుండి జరిపించారు. తనతో 'ప్రతినిధి 2' చిత్రంలో నటించి నటి శిరీషతో అతని వివాహం 2025 అక్టోబర్ 30న జరిగింది. తండ్రి మరణంతో వివాహం కాస్తంత ఆలస్యమైంది. ఈ యేడాది జూన్ 23న వీరిద్దరూ 'పేరెంట్స్' హోదాను పొందారు. తాజాగా తమ బాబుకు 'నందన్ రామ' అనే పేరు పెట్టినట్టు వీరు ప్రకటించారు.
ఇక కెరీర్ విషయానికి వస్తే నారా రోహిత్ చివరగా 'సుందరకాండ' సినిమాలో నటించాడు. వినోద ప్రధానంగా తెరకెక్కిన ఈ సినిమా ఫర్వాలేదనిపించింది. ప్రస్తుతం వెంకటేశ్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కిస్తున్న 'ఆదర్శ కుటుంబం'లో నారా రోహిత్ నటిస్తున్నాడు. విశేషం ఏమంటే.. వెంకటేశ్ నటిస్తున్న మరో సినిమా 'జనవరి 12 విడుదల'లో నందమూరి కళ్యాణ్ రామ్ కీలక పాత్ర చేస్తున్నాడు. ఆ రకంగా వెంకీతో ఇటు నందమూరి అటు నారా హీరోలు బ్యాక్ టూ బ్యాక్ మూవీస్ చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
‘ది ప్యారడైజ్’ అడ్వాన్స్ బుకింగ్స్.. అసలు ఊహించలేదు కదా
దర్శకుడు శ్రీను వైట్ల కూతురిని చూశారా.. హాలీవుడ్ మోడల్‌కు ఏమాత్రం తీసిపోదు
మెగాస్టార్‌తో బుచ్చిబాబు.. నిర్మాణ సంస్థ కూడా రెడీ!