సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

నంది అవార్డుల కమిటీల ఏర్పాటు.. స్పెషల్ అవార్డ్స్ కమిటీ ఛైర్మన్‌గా బాలకృష్ణ

ABN, Publish Date - Nov 26 , 2026 | 04:54 PM

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2017 నుంచి 2025 వరకు నంది అవార్డుల ప్రదానానికి కమిటీలను ఏర్పాటు చేసింది. స్పెషల్ అవార్డ్స్ కమిటీ ఛైర్మన్‌గా నందమూరి బాలకృష్ణను నియమించింది.

Nandi Awards

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నంది అవార్డుల ప్రదానోత్సవానికి ఏర్పాట్లను ముమ్మరం చేస్తోంది. అదే సమయంలో ఇంకా ప్రకటించాల్సి ఉన్న 2017 - 2025 సంవత్సరాల అవార్డులకు గానూ కమిటీలను ఏర్పాటు చేసింది. 2017 - 2024 మధ్యలో వచ్చిన సినిమాలలో యేడాదికి మూడు చిత్రాలకు ప్రధమ, ద్వితీయ, తృతీయ అవార్డులు ఇవ్వబోతోంది. అలానే రెండు స్పెషల్ జ్యూరీ అవార్డులను ప్రతి యేడాదికీ ప్రకటించనుంది. 2017, 2018కి కమిటీకి సీనియర్ జర్నలిస్ట్ ఎన్.సీతారామరాజు, 2019, 2020 కమిటీకి దర్శకులు ఎ. కోదండరామిరెడ్డి, 2021, 2022 కమిటీకి ఎడిటర్‌ కోటగిరి వెంకటేశ్వరరావు, 2023, 2024 కమిటీకి దర్శకులు రేలంగి నరసింహారావు ఛైర్మన్లుగా వ్యవహరించ నున్నారు. వీరితో పాటు ప్రతి కమిటీలోనూ ఆరుగురు సభ్యులను నియమించారు. ఇక 2025వ సంత్సరానికి పూర్తి స్థాయిలో నంది అవార్డులను ప్రకటించబోతున్నారు. ఈ కమిటీకి దర్శకులు బి.గోపాల్‌ ను ఛైర్మన్ గా నియమించారు. 2025 డాక్యుమెంటరీ, ఎడ్యుకేషన్‌ ఫిలిమ్స్ కమిటీ ఛైర్మన్ గా టి. ప్రసన్న కుమార్ వ్యవహరిస్తారు. 2025వ సంవత్సరానికి గానూ ఉత్తమ సినీ గ్రంథం, రచయిత ఎంపిక కమిటీకి పరుచూరి గోపాలకృష్ణ ఛైర్మన్ గా వ్యవహరిస్తారు. 2017 నుంచి 2020 వరకూ ఇవ్వబోయే టీవీ అవార్డుల కమిటీకి శింగంపల్లి శ్రుతి ఛైర్మన్ గా వ్యవహరిస్తారు.


స్పెషల్ అవార్డ్స్ కమిటీ ఛైర్మన్‌గా నందమూరి బాలకృష్ణ

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం 2017 నుంచి 2024 వరకూ జాతీయ అవార్డులను సైతం సినీ ప్రముఖులు అందచేయాలని భావించింది. ఎన్టీఆర్‌ నేషనల్ అవార్డ్ తో పాటు రఘుపతి వెంకయ్య, బిఎన్ రెడ్డి, నాగిరెడ్డి - చక్రపాణి అవార్డులను ఈ కేటగిరిలో అందచేస్తారు. ఈ కమిటీకి నందమూరి బాలకృష్ణ ఛైర్మన్ గా వ్యవహరిస్తారు. ఈ కమిటీలో సభ్యులుగా వరప్రసాద్‌ రెడ్డి, సుద్దాల అశోక్‌ తేజ, కైకాల నాగేశ్వరరావు ఉంటారు. అలానే 2025 నేషనల్ అవార్డుల కమిటీకి నందమూరి బాలకృష్ణనే ఛైర్మన్. అల్లు అరవింద్‌, ఎస్. గోపాల్‌ రెడ్డి, శ్రీమతి ప్రభ దీనికి సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీ లన్నింటిలోనూ ఎ.పి.ఎస్.ఎఫ్.టి.వి.టి.డి.సి మేనేజింగ్‌ డైరెక్టర్ తో సభ్యులుగా వ్యవహరిస్తారు.

ఇవి కూడా చదవండి:

ఆడంబరాల పెళ్లి.. ‘ఆత్మగౌరవ వివాహం'లో మిగిలిందేమిటి?

బాలయ్య కూతురు సినిమా.. హీరో ఎవరో తెలుసా

ఆయనలా సీఎం అవుతా.. శర్వానంద్ ఏంటి అలా అనేశాడు

Updated Date - Nov 26 , 2026 | 06:01 PM