సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

బసవరామతారకం ఎన్టీఆర్ చారిటబుల్‌ ట్రస్ట్‌ ప్రారంభం

ABN, Publish Date - Jul 25 , 2026 | 12:36 PM

మహానటుడు ఎన్టీఆర్‌ సతీమణి బసవతారకం శతజయంతి సందర్భంగా శుక్రవారం ఆ కుటుంబ సభ్యులు చారిటబుల్‌ ట్రస్ట్‌ ప్రారంభించారు.

Nandamuri Basavatarakam NTR Charitable Trust Launch

మహానటుడు ఎన్టీఆర్‌ (NTR) సతీమణి బసవతారకం (Smt. Nandamuri Basava Tarakam) శత జయంతి సందర్భంగా శుక్రవారం ఆ కుటుంబ సభ్యులు చారిటబుల్‌ ట్రస్ట్‌ (Nandamuri Basava Tarakam NTR Charitable Trust) ప్రారంభించారు. ఈ ట్రస్ట్‌కు ఛైర్మన్‌గా ఎన్టీఆర్‌ తనయుడు మోహనకృష్ణ బాధ్యతలు స్వీకరించారు. నందమూరి మోహనరూప, నందమూరి సీమంతిని, తుమ్మల ప్రసన్నకుమార్‌ ఇందులో ట్రస్టీలు.


ఈ సందర్భంగా మోహనకృష్ణ మాట్లాడుతూ.. నాన్నగారి ప్రయాణంలో ఆయనకు అండగా నిలిచి, తనదైన బాధ్యతగా మా అందరినీ పెంచి తీర్చిదిద్దారు. ఆమె రుణం మేం ఎప్పటికీ తీర్చుకోలేం. అన్నదాన కార్యక్రమంతో ఈ సేవ మొదలైంది. పేదవారికి అన్ని రకాలుగా అండగా నిలబడుతూ.. వైద్యం అలాగే విద్యారంగంలో విద్యార్థులను ప్రోత్సహిస్తూ మేమే తెలుసుకొని అవసరం ఉన్నవారికి అన్ని విధాలుగా అండగా నిలబడాలని.. మరిన్ని సేవా కార్యక్రమాలలో పాలు పంచుకోవాలని కోరుకుంటున్నాము. ఆ పుణ్య దంపతులు ఆశీర్వాదాలు మా కుటుంబ సభ్యులకు, అలాగే తెలుగు వారందరికీ ఎప్పుడూ ఉంటాయని తెలిపారు.


నందమూరి మోహనరూప మాట్లాడుతూ.. తాతగారికి ప్రతి విషయంలో అండగా నిలిచిన మా నానమ్మను గౌరవించుకుంటూ ఈ ట్రస్ట్‌ ప్రారంభించాం. భవిష్యత్‌లో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తాం. తాతగారు ప్రజాసేవలో అలాగే తన వృత్తి వంటి నటనా రంగంలో బిజీగా ఉన్నప్పటికీ నానమ్మ తనదైన బాధ్యతగా తన సంతాన బాధ్యతలను తీసుకుని.. పిల్లల్ని పెంచి పెద్ద చేసి ఉత్తీర్ణులుగా తీర్చిదిద్దారు. ఆ పుణ్య దంపతులు ఎప్పటికీ మా మనసులో కొలువై ఉంటారు. తాత గారికి ప్రతి విషయంలో అండగా నిలిచి ఆయన ప్రతి అడుగులో వెంట నడుస్తూ సపోర్ట్ చేసిన మా నానమ్మ గారిని గౌరవించుకుంటూ ఈ ట్రస్టు ప్రారంభించడం జరిగింది. మా బాబాయ్‌ బాలకృష్ణకు త్వరగా నయం కావాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నానని అన్నారు. నందమూరి సీమంతిని మాట్లాడుతూ.. నేడు బసవతారకం శతజయంతి సందర్భంగా ట్రస్ట్ ప్రారంభించి అన్నదాన కార్యక్రమం చేయడం సంతోషంగా ఉంది. ఆ పుణ్య దంపతుల ఆశీస్సులు ఎప్పటికీ అందరికీ ఉంటాయని అన్నారు. ఈ ట్రస్ట్‌ ద్వారా మరెన్నో సేవా కార్యక్రమాలు చేయనున్నట్లు తుమ్మల ప్రసన్నకుమార్‌ చెప్పారు.

ఇవి కూడా చదవండి:

ప్రముఖ డైరెక్టర్ మృతి.. విషాదంలో ఇండస్ట్రీ

విద్యార్థుల పోరాటానికి సినీ ప్రముఖుల సంఘీభావం

సోషల్ మీడియాకు ఈ హీరోయిన్లు బైబై

Updated Date - Jul 25 , 2026 | 12:36 PM