టీటీడీకి కోటి సంగీత సేవ!

ABN , Publish Date - Aug 29 , 2026 | 07:26 AM

శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ నూతన ఛైర్మన్ శ్రీధర్ వర్మను సంగీత దర్శకులు కోటి కలిశారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి తనవంతుగా సంగీత సేవ చేస్తానని ఆయన తెలిపారు.

Music Director Koti

ఇటీవల తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ (ఎస్విబిసి) చైర్మన్ గా శ్రీధర్‌ వర్మ బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ప్రముఖ సంగీత దర్శకులు కోటి శ్రీధర్‌వర్మను గౌరవ పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంగీత పరంగా తన వంతు సేవను అందిస్తానని కోటి తెలిపారు. చైర్మన్ శ్రీధర్ వర్మ, సంగీత దర్శకుడు కోటి కలిసి ఈ విషయాలపై చర్చలు జరిపారు. ఎస్విబిసి శ్రీధర్ ఆధ్వర్యంలో మరింత అభివృద్ధి చెందాలనే ఆకాంక్షను కోటి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా శ్రీధర్ వర్మ సంగీత దర్శకుడు కోటిని శాలువాతో సత్కరించారు.

ఇవి కూడా చదవండి:

నాకంటే ఎక్కువ రెమ్యూనరేషనా?.. ప్రభాస్‌ని దీపికా అవమానించిందా

‘ఇరుముడి’ ఎఫెక్ట్.. రవితేజ హారర్ చిత్రానికి నిర్మాతలు దొరికేశారోచ్!

నిర్మాత ఎస్కేఎన్‌కు రాఖీ కట్టిన హీరోయిన్.. అంతా షాక్

Updated Date - Aug 29 , 2026 | 07:27 AM