సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

యూట్యూబర్‌ వైష్ణవి హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. ఆమె భర్త హరిబాబు దారుణ హత్య

ABN, Publish Date - Sep 17 , 2026 | 10:30 PM

నిండు గర్భిణి అని కూడా చూడకుండా భార్యను అతి కిరాతకంగా హతమార్చిన కేసులో ప్రధాన నిందితుడైన యూట్యూబర్ వైష్ణవి భర్త చిట్టారి హరిబాబు దారుణ హత్యకు గురయ్యాడు.

Vaishnavi Husband Haribabu

తెలంగాణలో గతంలో తీవ్ర సంచలనం సృష్టించిన కోరుట్ల యూట్యూబర్ వైష్ణవి (YouTuber Vaishnavi) హత్య కేసులో ఊహించని మలుపు చోటుచేసుకుంది. నిండు గర్భిణి అని కూడా చూడకుండా భార్యను అతి కిరాతకంగా హతమార్చిన కేసులో ప్రధాన నిందితుడైన ఆమె భర్త చిట్టారి హరిబాబు (Haribabu) దారుణ హత్యకు గురయ్యాడు. నిజామాబాద్ నగరంలోని ఆర్‌ఆర్‌ చౌరస్తా (రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతం) వద్ద పట్టపగలే నడిరోడ్డుపై గుర్తుతెలియని దుండగులు కత్తులతో విరుచుకుపడి అతడిని హతమార్చారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

అసలేం జరిగిందంటే..

జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన గంధం వైష్ణవి సోషల్ మీడియాలో రీల్స్, యూట్యూబ్ వీడియోలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆమెకు అదే ప్రాంతానికి చెందిన హరిబాబుతో వివాహమైంది. అయితే పెళ్లయిన కొద్దిరోజులకే అదనపు కట్నం కోసం వేధింపులు మొదలయ్యాయి. ఈ క్రమంలో 2026 మార్చి నెలలో, వైష్ణవి 4 నెలల గర్భవతిగా ఉన్న సమయంలో ఇంట్లోనే ఆమెపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేసి హరిబాబు దారుణంగా కడతేర్చాడు. రాష్ట్రవ్యాప్తంగా పెను దుమారం రేపిన ఈ కేసులో పోలీసులు హరిబాబును అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. అయితే, ఇటీవల అతడు కోర్టు నుంచి బెయిల్ పొంది జైలు నుంచి బయటకు వచ్చాడు.


కారులో వచ్చి.. వెంటాడి వేటాడి హత్య

బెయిల్‌పై బయట తిరుగుతున్న హరిబాబు కదలికలపై కొందరు దుండగులు నిఘా పెట్టినట్లు తెలుస్తోంది. గురువారం నిజామాబాద్‌లోని ఆర్‌ఆర్‌ చౌరస్తా వద్దకు హరిబాబు రాగా.. కారులో వచ్చిన గుర్తుతెలియని వ్యక్తులు ఒక్కసారిగా అతడిని చుట్టుముట్టారు. కొబ్బరి బొండాల కత్తులతో నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే విచక్షణారహితంగా నరికారు. ప్రాణాలు కాపాడుకునేందుకు అతడు తప్పించుకునే ప్రయత్నం చేసినప్పటికీ వెంటాడి మరీ దాడి చేయడంతో తీవ్ర రక్తస్రావమై హరిబాబు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.


పగతోనే ప్రతీకార హత్య

గర్భిణి అయిన వైష్ణవిని కిరాతకంగా చంపినందుకే, పాత కక్షలు, ప్రతీకారంతోనే ఆమె కుటుంబ సభ్యులు లేదా బంధువులే పథకం ప్రకారం ఈ హత్యకు పాల్పడి ఉంటారని పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆ ప్రాంతంలోని సీసీటీవీ (CCTV) ఫుటేజీలను పరిశీలిస్తూ హంతకుల కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు ముమ్మరం చేశారు. భార్యను చంపి బెయిల్‌పై వచ్చిన భర్త కొద్ది నెలల్లోనే హత్యకు గురికావడం ప్రాంతీయంగా చర్చనీయాంశమైంది.

ఇవి కూడా చదవండి:

‘ద ప్యారడైజ్’తో కొడితేనే.. నానికి ఆ ట్యాగ్!

పవన్ కళ్యాణ్‌‌తో ఒకే ఒక్క ఛాన్స్.. : నటి కావ్యశ్రీ

క్రికెట్‌లో లెజెండే.. పడకగదిలో ఆకట్టుకోలేదు: రోహిత్ శర్మపై నటి షాకింగ్ కామెంట్స్

Updated Date - Sep 17 , 2026 | 10:30 PM