గరికపాటికి ‘కింగ్ బుద్ధ’ డైరెక్టర్ వార్నింగ్.. విషయం ఏమిటంటే?
ABN, Publish Date - May 02 , 2026 | 07:25 PM
బుద్ధ జయంతిని సంపూర్ణ నేషనల్ హాలిడేగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ.. ఢిల్లీ జంతర్ మంతర్ వేదికగా నిర్వహించిన ధర్నాలో హాలీవుడ్ మూవీ ‘కింగ్ బుద్ధ’ డైరెక్టర్ సత్యారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
బుద్ధ జయంతిని సంపూర్ణ నేషనల్ హాలిడేగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ.. ఢిల్లీ జంతర్ మంతర్ వేదికగా నిర్వహించిన ధర్నాలో హాలీవుడ్ మూవీ ‘కింగ్ బుద్ధ’ డైరెక్టర్ (King Buddha Director) సత్యారెడ్డి (Satyareddy) తీవ్రంగా స్పందించారు. అంతేకాదు, గతంలో గౌతమ బుద్ధుడిని పిరికివాడిగా వ్యాఖ్యానించిన ప్రవచనకర్త గరికపాటి (Garikipati Narasimha Rao)కి ఆయన హెచ్చరిక జారీ చేశారు. ఇకనుంచి ఎవరైనా గౌతమ బుద్ధుని గురించి తప్పుగా ప్రచారం చేస్తే సహించేది లేదని, బుద్ధుని అవమానించే ప్రయత్నాలు ఏవైనా జరిగితే తీవ్రంగా ఖండిస్తామని ఆయన స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘గౌతమ బుద్ధుడు సాధారణ వ్యక్తి కాదు, ఆయన ‘శాక్య సింహం’. ఆయన జీవితం అంటే.. పిట్ట కథలు, చేపల కథలు కాదు, అది ఒక మహా వీరగాథ, శాంతి సందేశం. భావితరాలకు బుద్ధుని నిజమైన చరిత్ర, తత్వం, ఇంకా ఆయన చూపిన మార్గం తెలియజేయడం మన బాధ్యత. ఆయన బుద్ధుడిగా మారిన తర్వాత కపిలవస్తు రాజ్యంలో అడుగు పెట్టిన రోజు, ఆయన భార్య యశోదర పట్టణాన్ని దీపాలతో అలంకరించి అపూర్వ స్వాగతం పలికింది. ఆ మహత్తర సందర్భమే తర్వాత ‘బుద్ధ దీపావళి’గా మారింది. ప్రపంచవ్యాప్తంగా బుద్ధుని మార్గాన్ని అనుసరిస్తున్న దాదాపు 25 దేశాలు శాంతి, అభివృద్ధి, సమానత్వంలో ముందంజలో ఉన్నాయి. ఆ దేశాల పురోగతిని చూసి భారతదేశం కూడా మరోసారి బుద్ధిజం వైపు పయనించాలి. అదే నిజమైన శాంతి, అభివృద్ధికి దారి’’ అని సత్యారెడ్డి చెప్పుకొచ్చారు.
ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్న పలువురు మద్దతుదారులు.. బుద్ధ జయంతిని జాతీయ సెలవు దినంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ‘బుద్ధ జయంతి - జాతీయ గౌరవ దినం కావాలి’ అనే నినాదంతో ఈ ఉద్యమాన్ని దేశమంతా విస్తరించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లుగా సత్యారెడ్డితో పాటు మద్దతుదారులంతా వెల్లడించారు.
ఇవి కూడా చదవండి:
పవన్ కళ్యాణ్ నివాసానికి సీఎం చంద్రబాబు.. ఫొటోలు వైరల్!
‘నా పెళ్ళాం నిప్పు రా’.. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పోస్ట్ వైరల్!
తొక్కలో ఇంటర్వ్యూ.. అంటూ కుర్చీ విసిరేసి వెళ్లిపోయిన గెటప్ శ్రీను!
కయాదు లోహర్ గురించి ఈ విషయాలు తెలుసా?