సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

అప్పుడు చిరంజీవి.. ఇప్పుడు నేను.. అదృష్టంగా భావిస్తున్నా: జయప్రద

ABN, Publish Date - Jul 11 , 2026 | 12:55 PM

ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటేగానీ.. ఇలాంటి స్టేజ్ మీద నిలబడే అదృష్టం దక్కదు. అమ్మ సావిత్రి పేరు మీద ‘సావిత్రి క్లాసిక్స్’ ఇంగ్లీష్ ఎడిషన్ పుస్తకం రిలీజ్ చేయడం నా అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు నటీమణి జయప్రద.

Jayaprada at Savitri classics Launch

వెండితెర ధృవతార, తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచే మహానటి సావిత్రి (Mahanati Savitri). ఆమె 90వ జయంతి సందర్భంగా సంజయ్ కిషోర్ రచించిన ‘సావిత్రి క్లాసిక్స్’ (Savitri Classics) ఇంగ్లీషు పుస్తకావిష్కరణ కార్యక్రమం శుక్రవారం సాయంత్రం హైదరాబాద్‌లో గ్రాండ్‌గా జరిగింది. ఈ కార్యక్రమానికి సీనియర్ నటీమణి జయప్రద, ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు, బ్రహ్మానందం, తమ్మారెడ్డి భరద్వాజ, కేఐ వరప్రసాద్ రెడ్డి, నిర్మాత నాగ సుశీల, సావిత్రి కుమార్తె విజయ చాముండేశ్వరి, జయలలిత, సంజయ్ కిషోర్, బొల్లినేని కృష్ణయ్య తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. జయప్రద ఈ పుస్తకాన్ని ఆవిష్కరించి.. తొలి ప్రతిని రఘురామ కృష్ణంరాజుకి అందజేశారు.


అనంతరం జయప్రద (Jayaprada) మాట్లాడుతూ.. ‘‘ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటేగానీ.. ఇలాంటి స్టేజ్ మీద నిలబడే అదృష్టం దక్కదు. అమ్మ సావిత్రి పేరు మీద ‘సావిత్రి క్లాసిక్స్’ ఇంగ్లీష్ ఎడిషన్ పుస్తకం రిలీజ్ చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. తెలుగు వర్షెన్‌ని నాకు ఇష్టమైన హీరో మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) రిలీజ్ చేశారు. ఇప్పుడు ఆ అదృష్టం నాకు దక్కింది. నా సోదరి చాముండేశ్వరి ఇంటికి వచ్చి ఈ కార్యక్రమం గురించి చెప్పారు. చాముండేశ్వరిని చూస్తే నాకు సావిత్రమ్మే మా ఇంటికి వచ్చినట్టు అనిపించింది. ఆమె నటించినప్పుడు నేను పుట్టలేదు. ఆమె సినిమాల్ని చూస్తూ నేను పెరిగాను. అలాంటి స్టేజ్ నుంచి ఇలాంటి స్టేజ్ వరకు రావడం నా పూర్వజన్మ సుకృతం.


సావిత్రి అంటే ఉత్తమ నటన.. ఉత్తమ నటన అంటే సావిత్రి. ఆమే ఒక అద్భుతం. ఆమె ఒక్క చూపులోనే ఎన్నో హావభావాలుంటాయి. ఎన్టీఆర్, ఏఎన్నార్‌లాంటి వారితో ఆమె ధీటుగా నటించారు. అందుకే ఆమెకు మహానటి బిరుదునిచ్చారు. ‘మిస్సమ్మ’, ‘నర్తనశాల’లో సావిత్రమ్మ చేసిన పాత్రలు నాకు కూడా చేయాలనే కోరిక ఉండేది. ఆ తల్లి చనిపోయినా.. ఈ తల్లి (చాముండేశ్వరి), గోవింద రావు కలిసి సావిత్రమ్మను సజీవంగానే ఉంచేలా చేస్తున్నారు. ఈ తరానికి సావిత్రమ్మను పరిచయం చేయాలని ఇంగ్లీష్ ఎడిషన్‌లో పుస్తకాన్ని విడుదల చేయడం ఆనందంగా ఉంది. సావిత్రి గారంటే తెలుగుతనం, అమ్మతనం. సంజయ్ చాలా గొప్పవారు. ఇలాంటి వారు లేకపోతే సావిత్రమ్మ వంటి వారి గురించి భావితరాలకు ఎలా తెలుస్తుంది. ఎంతో పరిశోధన చేసి ఇలాంటి పుస్తకాల్ని తీసుకు రావడం సంతోషంగా ఉంది. సావిత్రమ్మ లాంటి వాళ్లు మళ్లీ పుట్టలేరు, తెలుగు ఇండస్ట్రీ గర్వించదగ్గ మహానటి మన సావిత్రి’’ అని చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి:

Sunday Tv Movies: జూలై 12, ఆదివారం.. తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో ప్ర‌సార‌మ‌య్యే సినిమాలు

పవన్ కళ్యాణ్ రెండు భుజాలకీ రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్.. శస్త్ర చికిత్స!

అయ్యగారి ‘లెనిన్’ ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే..

Updated Date - Jul 11 , 2026 | 12:55 PM