సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

జబర్దస్త్ దొరబాబు కొత్త ఇల్లు చూశారా.. కళ్ళు జిగేల్ మనాల్సిందే!

ABN, Publish Date - May 07 , 2026 | 10:42 PM

బుల్లితెర పాపులర్ కామెడీ షో ‘జబర్దస్త్’ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న కమెడియన్ దొరబాబు.. తన చిరకాల స్వప్నాన్ని నెరవేర్చుకున్నారు. హైదరాబాద్‌లో అత్యంత విలాసవంతమైన కొత్త ఇంటిలోకి ఆయన ప్రవేశించారు.

Jabardasth Dorababu New House

బుల్లితెర పాపులర్ కామెడీ షో ‘జబర్దస్త్’ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న కమెడియన్ దొరబాబు (Dorababu).. తన చిరకాల స్వప్నాన్ని నెరవేర్చుకున్నారు. హైదరాబాద్‌లో అత్యంత విలాసవంతమైన కొత్త ఇంటిని (Jabardasth Dorababu House) నిర్మించుకున్న ఆయన.. తాజాగా కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో అత్యంత వైభవంగా గృహప్రవేశ వేడుకను నిర్వహించారు. దొరబాబు తన భార్య నందినితో కలిసి శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇంటి బయట ‘శ్రీ చాముండేశ్వరి నిలయం’ అనే పేరుతో ఉన్న నేమ్ ప్లేట్, మామిడి తోరణాలతో అలంకరించిన విజువల్స్‌తో కూడిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


ఈ వేడుకకు జబర్దస్త్ టీమ్ మొత్తం హాజరై సందడి చేసింది. ముఖ్యంగా స్టార్ కమెడియన్స్ హైపర్ ఆది (Hyper Aadi), బుల్లెట్ భాస్కర్, నరేష్ వంటి వారంతా హాజరై.. దొరబాబు దంపతులకు శుభాకాంక్షలు తెలియజేశారు. వారి రాకతో ఆ ప్రాంగణమంతా నవ్వులు, ఆటపాటలతో సందడిగా మారింది. జబర్దస్త్ స్టేజ్ పైన మాత్రమే కాకుండా, బయట కూడా తమ మధ్య ఉన్న బలమైన స్నేహ బంధాన్ని ఈ వేడుక మరోసారి చాటిచెప్పింది. అతిథులందరికీ దొరబాబు స్వయంగా వడ్డించి, వారితో కలిసి ఫోటోలు దిగుతూ వేడుకను ఎంజాయ్ చేశారు.


ఇక దొరబాబు నూతన గృహం లోపల ఇంటీరియర్ డిజైన్ అద్భుతంగా ఉంది. అత్యాధునిక హంగులతో, విశాలమైన హాల్ మరియు ఇంట్రెస్టింగ్ కలర్ కాంబినేషన్లతో కళ్లు జిగేల్ మనేలా ఇల్లు మెరిసిపోతోంది. ముఖ్యంగా పూజా గదిని ఎంతో భక్తిభావం ఉట్టిపడేలా తీర్చిదిద్దారు. అతి తక్కువ కాలంలోనే కష్టపడి తనకంటూ ఒక అందమైన గూడును నిర్మించుకున్న దొరబాబును చూసి అభిమానులు సోషల్ మీడియా వేదికగా అభినందనలు కురిపిస్తున్నారు. ఈ గృహప్రవేశ వేడుకకు సంబంధించిన వీడియోలను దొరబాబు తన ఇన్‌స్టా వేదికగా షేర్ చేయగా, అవి కాస్తా వైరల్‌గా మారాయి.

ఇవి కూడా చదవండి:

తెలుగబ్బాయినే పెళ్లి చేసుకుంటా: పాయల్

Peddi Movie: కథ విని, 20 నిమిషాల పాటు మనిషిని కాలేకపోయా- ప్రొడక్షన్ డిజైనర్

Lavanya Tripathi: ఇకపై ప్రెగ్నెంట్ అని తెలిస్తే.. ఆ పని చేయను

Updated Date - May 07 , 2026 | 10:43 PM