గోపీచంద్, రష్మిక ఊర మాస్ పోస్టర్.. అసలు విషయం ఇదే!
ABN, Publish Date - Jun 29 , 2026 | 09:24 PM
ప్రస్తుతం ఏఐ కాలం నడుస్తోంది. ఈ యుగంలో ఏది నిజమో, ఏది ఫేకో తెలుసుకోవడానికి చాలా తంటాలు పడాల్సి వస్తోంది. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న ఓ పోస్టర్ చూస్తే.. భవిష్యత్‌ని తలుచుకుంటేనే భయమేస్తోంది.
ప్రస్తుతం ఏఐ (AI) కాలం నడుస్తోంది. ఈ యుగంలో ఏది నిజమో, ఏది ఫేకో తెలుసుకోవడానికి చాలా తంటాలు పడాల్సి వస్తోంది. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న ఓ పోస్టర్ చూస్తే.. భవిష్యత్‌ని తలుచుకుంటేనే భయమేస్తోంది. అవును, ఈ పోస్టర్‌లో మ్యాచో హీరో గోపీచంద్ (Gopichand), నేషనల్ క్రష్ రష్మిక మందన్నా (Rashmika Mandanna).. ఊర మాస్ అవతార్‌లో కనిపిస్తున్నారు. గోపీచంద్ చేతిలో కత్తి పట్టుకుని, ఛైర్‌లో రాజసం ఉట్టిపడేలా కూర్చుని స్మోక్ చేస్తుంటే.. ఆయన వెనుకే రష్మిక మందన్నా గన్ పట్టుకుని.. ‘ఎవడొస్తాడో రండిరా’ అన్నట్లుగా ఉంది. నిజంగా ఈ పోస్టర్ చూసిన వారంతా.. ఒక్కసారిగా సర్‌ప్రైజ్ అవుతున్నారు. ఎందుకంటే..
వీళ్లద్దరూ కలిసి సినిమా ఎప్పుడు చేశారు. అసలు ఎటువంటి అనౌన్స్‌మెంట్ కూడా రాలేదు కదా. డైరెక్ట్‌గా ఈ పోస్టరేంటి? అని అంతా ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే, ప్రస్తుతం రష్మిక రేంజ్ అలా ఉంది. పెళ్లి తర్వాత, చాలా సెలక్టివ్‌గా ఆమె సినిమాలను ఎంపిక చేసుకుంటోంది. మరీ ముఖ్యంగా బాలీవుడ్‌పై, పాన్ ఇండియా సినిమాలపైనే ఆమె చూపు ఉంది. ప్రస్తుతం ఆమె చేస్తున్న సినిమాల లిస్ట్‌లో ఎక్కడా గోపీచంద్ పేరు రాలేదు. మరి ఇదెలా అంటే.. అదే ఏఐ మ్యాజిక్. అందరూ నిజం అనుకునే రేంజ్‌లో.. ఈ పోస్టర్‌ని క్రియేట్ చేసిన వాళ్లకి హ్యాట్సాఫ్ చెప్పొచ్చు.
ఈ పోస్టర్ చూసిన వాళ్లంతా.. దీనికి ఒరిజినల్ స్టిల్ ఏమై ఉంటుందా? అని తెగ సెర్చ్ చేస్తున్నారు. అలా సెర్చింగ్‌లో ఇది లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj), వామికా గబ్బి (Wamiqa Gabbi) ప్రధాన పాత్రలలో నటిస్తోన్న ‘డీసీ’ (DC) మూవీ స్టిల్ నుంచి క్రియేట్ చేసినట్లుగా కొందరు నెటిజన్లు కనిపెట్టేశారు. దర్శకుడు లోకేష్ కనగరాజ్ హీరోగా నటిస్తోన్న చిత్రమిది. ఇందులో బాలీవుడ్ భామ వామికా గబ్బి హీరోయిన్‌గా నటిస్తోంది. మొత్తంగా అయితే, ఒక్కసారిగా అందరినీ ఈ పోస్టర్‌తో బురిడీ కొట్టించారు ఏఐ రాయుళ్లు. ముందు ముందు ఇలాంటివి ఇంకా ఎన్ని చూడాలో..
ఇవి కూడా చదవండి:
డెలివరీ బాయ్‌ని కొట్టిన ‘రాజు వెడ్స్ రాంబాయి’ హీరో.. వీడియో వైరల్
‘విశ్వంభర’ సెన్సేషనల్ అప్డేట్.. ఇక విడుదలే!
ఎన్టీఆర్-త్రివిక్రమ్ మూవీ అనౌన్స్‌మెంట్.. పోస్టర్ అదిరిపోయిందిగా!