‘విశ్వంభర’ సెన్సేషనల్ అప్డేట్.. ఇక విడుదలే!
ABN , Publish Date - Jun 29 , 2026 | 06:22 PM
టాలీవుడ్ బాస్, మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో జెట్ స్పీడ్‌లో దూసుకుపోతున్నారు. ఈ ఏడాది ఇప్పటికే ‘మన శంకర వర ప్రసాద్ గారు’ చిత్రంతో బాక్సాఫీస్ వద్ద అదరగొట్టిన చిరంజీవి.. ప్రస్తుతం బాబీ కొల్లి దర్శకత్వంలో మాస్ యాక్షన్ మూవీ చేస్తున్నారు.
టాలీవుడ్ బాస్, మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) వరుస సినిమాలతో జెట్ స్పీడ్‌లో దూసుకుపోతున్నారు. ఈ ఏడాది ఇప్పటికే ‘మన శంకర వర ప్రసాద్ గారు’ (Mana Shankara Vara Prasad Garu) చిత్రంతో బాక్సాఫీస్ వద్ద అదరగొట్టిన చిరంజీవి.. ప్రస్తుతం బాబీ కొల్లి (Bobby Kolli) దర్శకత్వంలో మాస్ యాక్షన్ మూవీతో బిజీగా ఉన్నారు. అయితే చిరు నుంచి రావాల్సిన ‘విశ్వంభర’ (Vishwambhara) చిత్రంపై మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి కీలక్ అప్టేడ్ రాలేదు. మూడేళ్లుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రామాలతో బిజీగా ఉంది. దీంతో రిలీజ్ డేట్‌పై మాత్రం ఇప్పటికీ సరైన క్లారిటీ రాలేదు. ఈ సినిమా కోసం మెగా అభిమానులతో పాటు సగటు సినీ ప్రేక్షకుడు కూడా కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారంటే అతిశయోక్తి కాదు. అయితే, ఎప్పుడో రావాల్సిన ఈ సినిమా.. ఫ్యాన్స్‌ను కాస్త టెన్షన్ పెడుతూ వాయిదాల పర్వంలో చిక్కుకుంది. గతేడాది స్వయంగా మెగాస్టార్ చెప్పినా.. ఆ డెడ్ లైన్ కూడా మిస్ అయ్యింది. దీంతో ఫ్యాన్స్‌లో కాస్త నిరాశ మొదలైంది. కానీ.. ఇప్పుడు వారిలో రెట్టింపు ఉత్సాహం నింపేలా ఒక సెన్సేషనల్ అప్డేట్ ఇండస్ట్రీలో వైరల్ అవుతోంది.
తాజాగా అందుతున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ‘విశ్వంభర’ మూవీకి సంబంధించిన వీఎఫ్‌ఎక్స్ వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. గ్రాఫిక్స్ పని పూర్తవ్వగానే, ఫైనల్ అవుట్‌పుట్‌ను మెగాస్టార్ చిరంజీవి స్వయంగా వీక్షించారట. స్క్రీన్ మీద ఆ విజువల్స్ చూసి ఆయన పూర్తి స్థాయిలో సంతృప్తి వ్యక్తం చేసినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది. చిరు లాంటి పర్ఫెక్షనిస్ట్ ఆనందించారు అంటే.. తెరపై బొమ్మ ఏ రేంజ్‌లో ఉండబోతుందో మనం ఊహించుకోవచ్చు. చిరంజీవి, సోషియో ఫాంటసీ.. ఈ రెండు పదాలు పక్కపక్కన చేరగానే మనకు వెంటనే గుర్తొచ్చే ఎపిక్ బ్లాక్ బస్టర్ ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’. ఆ మ్యాజిక్ మళ్లీ ఇన్నేళ్లకు రిపీట్ కాబోతోందని ఫిల్మ్ నగర్ టాక్. దానికి తోడు, ఈ సినిమా కథాంశంపై ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ వైరల్ అవుతోంది. అదేంటంటే.. సృష్టి, స్థితి, లయ.. అనే మూడు మూలస్తంభాల చుట్టూ ఈ కథ సాగుతుందట. అసలు ఈ సృష్టికి మూలం ఏమిటి? ఈ లోకాలను శాసించే ఆ అదృశ్య శక్తి వెనుక ఉన్న రహస్యం ఏంటి? లాంటి ఎన్నో ఆసక్తికరమైన ప్రశ్నలకు సమాధానంగా డైరెక్టర్ మల్లిడి వశిష్ట ఈ కథను సిద్ధం చేశారు. ‘బింబిసార’ వంటి చిత్రంతో తన మార్క్ చూపించిన వశిష్ట.. మెగాస్టార్‌ను మునుపెన్నడూ చూడని సరికొత్త అవతారంలో చూపించబోతున్నారు.
ఇక ఈ భారీ సినిమాలో మెగాస్టార్‌కు జోడిగా ఎవర్ గ్రీన్ బ్యూటీ త్రిష కృష్ణన్ నటిస్తోంది. అలాగే, కన్నడ సోయగం ఆషికా రంగనాథ్ కూడా ఒక అత్యంత కీలకమైన పాత్రలో నటిస్తుండటం విశేషం. ఈ సినిమాను కేవలం టాలీవుడ్‌కే పరిమితం చేయకుండా, పాన్ ఇండియా రేంజ్‌లో భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు యూవీ క్రియేషన్స్ సంస్థ పక్కా ప్లానింగ్ చేస్తోంది. దీనికోసం వాళ్లు ఎక్కడా రాజీ పడకుండా భారీ బడ్జెట్‌ను కేటాయిస్తున్నారు. ఇక ఈ విజువల్ ఎపిక్‌కి ఆస్కార్ విన్నర్, లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఎం.ఎం. కీరవాణి ప్రాణం పోసే సంగీతాన్ని, గూస్‌బంప్స్ తెప్పించే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ను అందిస్తున్నారు. మొత్తానికి, లేట్ అయినా లేటెస్ట్‌గా వస్తున్న ‘విశ్వంభర’.. బాక్సాఫీస్ దగ్గర క్రియేట్ చేయబోయే సెన్సేషన్ అంతా ఇంతా కాదని అర్థం అవుతోంది. ఇక రిలీజ్ డేట్‌పై కూడా త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి.
ఇవి కూడా చదవండి:
ఎన్టీఆర్-త్రివిక్రమ్ మూవీ అనౌన్స్‌మెంట్.. పోస్టర్ అదిరిపోయిందిగా!
క్రేజీ అప్డేట్.. హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌లో సూర్య.. ‘జై భీమ్’ కాంబో రిపీట్!
‘హ్యాపీ జర్నీ’ టీజర్.. మగాళ్లకు తెలియాల్సిన మహిళల భావోద్వేగాలు!