విద్యార్థుల పోరాటానికి సినీ ప్రముఖుల సంఘీభావం
ABN, Publish Date - Jul 25 , 2026 | 11:45 AM
నీట్ పేపర్ లీకేజీపై ఢిల్లీలో విద్యార్థులు చేస్తున్న పోరాటానికి కొందరు సినీ ప్రముఖులు సంఘీభావం ప్రకటించారు. విద్యార్థుల డిమాండ్లను వెంటనే నెరవేర్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
నీట్ పేపర్ లీకేజీపై ఢిల్లీలో విద్యార్థులు చేస్తున్న పోరాటానికి కొందరు సినీ ప్రముఖులు సంఘీభావం ప్రకటించారు. విద్యార్థుల డిమాండ్లను వెంటనే నెరవేర్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
మీ పోరాటానికి నా సెల్యూట్
తమ చిన్ని డిమాండ్లు సాధించుకోవడానికి లక్షల మంది పిల్లలు లాఠీ దెబ్బలు తిని రక్తమోడుతున్నారు. తిండితిప్పలు మాని దెబ్బలకు ఓర్చుకుని, రాత్రనకా, పగలనకా ఉద్యమిస్తున్నారు. ప్రభుత్వం వాళ్ల మాట వినాలి. వాళ్లకి భరోసా ఇవ్వాలి. వాళ్ల స్ఫూర్తిని గెలిపించాలి. మన పిల్లలు గెలిస్తే దేశం గెలిచినట్టు. మన పిల్లలు గెలిస్తే మనం బతికినట్టు. డియర్ జెన్ జీ.. మీరు చేస్తున్న పోరాటానికి చేతులెత్తి దండం పెడుతున్నా.. ఐ సెల్యూట్ యూ. -దర్శకుడు శేఖర్ కమ్ముల
నిజాలు మాట్లాడితే దేశ ద్రోహులు అంటున్నారు
నిజం అనేది నిలకడ మీద కచ్చితంగా తెలుస్తుంది. మనల్ని దేశ ద్రోహులు అనే వారి మాటలు వినకండి. దేశానికి మంచి జరగాలనే ఆందోళనలకు దిగాం. నిజాలు మాట్లాడితే దేశద్రోహులు అనే ముద్ర వేస్తున్నారు. అవినీతి అంతం కావాలని కోరుకుందాం. - గాయని చిన్మయి శ్రీపాద
ప్రతి పౌరుడూ స్పందించాలి
దేశంలో జరుగుతున్న సామాజిక, ప్రజా ఉద్యమాలపై ప్రతి పౌరుడూ బాధ్యతగా స్పందించాలి. ఢిల్లీలో పోరాటం చేస్తున్న విద్యార్థుల డిమాండ్లు వెంటనే నెరవేర్చాలి. సోనమ్ వాంగ్‌చుక్‌పై నాకు నమ్మకముంది. సీజేపీ న్యాయపరమైన పోరాటం చేస్తోంది. - నటి మంచు లక్ష్మి
ఇవి కూడా చదవండి:
సోషల్ మీడియాకు ఈ హీరోయిన్లు బైబై
ఈ వయసులో శ్రీరాముడి పాత్రలో జీవించడం చాలా కష్టం: రణ్‌బీర్ కపూర్
అల్లుడు భద్రంకు ‘మెగా158’లో అవకాశం.. సోము వీర్రాజు ఏం చేశారంటే