మళ్లీ వస్తా.. మునుపటిలాగే అలరిస్తా!

ABN , Publish Date - Jun 10 , 2026 | 06:56 PM

వస్తా.. తప్పకుండా వస్తా.. ఎప్పటిలానే అలరిస్తా అంటోంది సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ దీప్తి సునయన. బ్రేకప్ తర్వాత మొహం చూపించకుండా వెళ్ళిన అమ్మడు మళ్ళీ తిరిగి వస్తానంటోంది. దీంతో బ్యూటీ కమ్ బ్యాక్‌ గురించి తెలిసిన అభిమానులు ఖుషీ అవుతున్నారు.

డబ్‌స్మాష్‌లతో దద్దరిల్లేలా చేసింది. కవర్ సాంగ్స్‌తో క్రేజ్ తెచ్చుకుంది. బిగ్‌బాస్ హౌస్‌లో తన చిలిపితనంతో కుర్రాళ్ళ గుండెల్లో ‘సు'నయన బాణాలు గుచ్చింది. ఎస్... సోషల్ మీడియా క్వీన్ దీప్తి సునయన మళ్లీ సౌండ్ చేయడానికి రెడీ అయిపోయింది. యూట్యూబ్‌లో కవర్ సాంగ్స్‌తో సోషల్ మీడియా క్వీన్ గా మారిన దీప్తి... బిగ్ బాస్ 2లో సందడి చేసింది.


తన అమాయకత్వం, చిలిపితనంతో అభిమానుల్ని సంపాదించుకున్న దీప్తి తొలుత యూట్యూబర్ షణ్ముఖ్ జశ్వంత్‌తో ప్రేమలో పడింది. కొన్నేళ్ళ లవ్ ట్రాక్ తర్వాత వీరిద్దరూ 2022లో అఫీషియల్ బ్రేకప్ చెప్పుకున్నారు. ఈ తర్వాత కెమెరా లైట్స్‌కి, షూటింగ్ స్పాట్స్‌కి పూర్తిగా దూరమైపోయింది. కేవలం ట్రావెలింగ్, గుళ్లు-గోపురాలు తిరుగుతూ కాస్త పీస్‌ఫుల్ వైబ్స్‌లో ఉండిపోయింది. ఇటు షణ్ముఖ్ పెళ్ళి చేసుకుని, సినిమాలతో లైఫ్‌లో నెక్స్ట్ లెవెల్‌కి వెళ్లిపోయాడు. కానీ, దీప్తి మాత్రం గత రెండేళ్ళుగా పనికి దూరంగా ఉంది.

చాలా కాలం తర్వాత తాజాగా దీప్తి సునయన అభిమానులను పలకరిస్తూ బాగా ఎమోషనల్ అయింది. ఫ్యాన్స్ చూపిస్తున్న లవ్‌కి కృతజ్ఞతలు తెలుపుతూ ఆమె చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. 'గడిచిన పదేళ్ళుగా నన్ను ఎందుకు ఇంతలా ప్రేమిస్తున్నారో నాకే తెలియదు. నేను పిచ్చిగా ప్రవర్తించినా భరించారు. సపోర్ట్ చేశారం'టూ ఎమోషనల్ అయ్యింది. రెండేళ్ళుగా పని చేయడానికి శక్తి లేక విశ్రాంతి తీసుకున్నానని... అయినా మళ్ళీ బిజీ అవమని అందరూ ప్రోత్సహిస్తున్నారని తెలిపింది. తాను ఎందుకు డీలా పడ్డానో తెలుసుకుంటున్నానని.. త్వరలో పూర్తి జోష్ తో మీ ముందుకు వస్తా అంటూ ఫ్యాన్స్‌కి కృతజ్ఞతలు తెలిపింది. ఈ పోస్ట్ చూసి అభిమానులు ఆమెకు ఆల్ ద బెస్ట్ చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి:

భారతీరాజా ‘సీతాకోకచిలుక’ హ్యాపీ ఎండింగ్‌కి కారణమిదే: ఏడిద రాజా

భారతీరాజా మృతికి ప్రముఖుల నివాళి

‘పెద్ది’ మైండ్ బ్లోయింగ్ స్ట్రాటజీ! నార్త్, ఓవర్సీస్‌లో ఇక తిరుగులేనట్టే!

బాలయ్య అన్‌స్టాపబుల్ జోష్

Updated Date - Jun 10 , 2026 | 07:10 PM