Dasari Ghat: చేసిందంతా మనోజ్.. క్రెడిట్ విష్ణు అకౌంట్‌లోనా.. నెటిజన్లు ఫైర్!

ABN , Publish Date - May 30 , 2026 | 10:57 PM

‘చేసిందంతా మంచు మనోజ్ అయితే.. అందరూ మంచు విష్ణుని రుద్దుతున్నారేంటిరా?’.. ఈ కామెంట్‌ ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. దాసరి ఘాట్ విషయంలో జరిగిన హంగామాపై నెటిజన్లు ఇలా రియాక్ట్ అవుతున్నారు.

Manchu Brothers Reaction on Dasari Ghat

‘చేసిందంతా మంచు మనోజ్ (Manchu Manoj) అయితే.. అందరూ మంచు విష్ణు (Manchu Vishnu)ని రుద్దుతున్నారేంటిరా?’.. ఈ కామెంట్‌ ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. దర్శకరత్న దాసరి నారాయణరావు (Dasari Narayana Rao) వర్ధంతిని పురస్కరించుకుని, ఆయన ఘాట్ విషయంలో శనివారం ఎలాంటి హంగామా నడిచిందో తెలియంది కాదు. ఓ జర్నలిస్ట్ షేర్ చేసిన వీడియోలను చూసిన మంచు మనోజ్ వెంటనే రియాక్టై, ఘాట్ మొత్తాన్ని క్లీన్ చేయించిన తీరు.. వీడియోల రూపంలో వైరల్ అవుతుంటే.., ఈ విషయంపై ఎప్పటికో స్పందించిన మంచు విష్ణు.. సోషల్ మీడియాలో క్రెడిట్ అంతా నాదే, అనేలా ప్రచారం చేయించుకుంటున్నారు.


దాసరి ఘాట్ (Dasari Ghat) గురించి తెలిసి వెంటనే రియాక్ట్ అయిన మంచు విష్ణు అంటూ కొందరు జర్నలిస్ట్‌లు చేసిన ట్వీట్స్ కింద కామెంట్స్ చూస్తే.. అసలు విషయం ఏంటో అర్థమవుతోంది. ఇదంతా పీఆర్ స్టంట్ అంటూ నెటిజన్లు పై విధంగా కామెంట్స్ చేస్తుండటం విశేషం. ఈ స్టంట్స్‌తో దాసరి ఘాట్‌ని అంతా క్లీన్ చేయించిన మంచు మనోజ్ పేరుని పక్కన పెట్టి మరీ.. విష్ణుని లేపుతున్నారు. మరో విషయం ఏమిటంటే.. మంచు విష్ణు అండ్ టీమ్ షేర్ చేసిన వీడియోలో కూడా మంచు మనోజ్ ఉండటం. ఇంతకంటే ఏం కావాలి? ఇదంతా పీఆర్ స్టంట్ అని తేల్చేయడానికి. అంతా ఖర్చు పెట్టి క్లీన్ చేయించిన మనోజ్‌ని పక్కన పెట్టేసి.. ఎక్కడో ఉండి, కనీసం ఘాట్ దగ్గరకు కూడా రాని విష్ణు.. క్రెడిట్ మొత్తం కొట్టేయాలని చూడటంతో, ఆయనపై తీవ్రంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.


ఈ పీఆర్ స్టంట్స్ చేయించకుండా.. ఎప్పటిలానే కామ్‌గా ఉన్నా విష్ణుకి గౌరవం దక్కేది. అనవసరంగా కెలుక్కుని, విష్ణు విమర్శలపాలవుతున్నారు. అయినా, దాసరి అంటే ప్రాణం ఇచ్చేంత ప్రేమ ఉందని చెప్పుకునే మంచు ఫ్యామిలీ, ఆయన వర్ధంతిని గుర్తు పెట్టుకోకపోవడం, ఎవరో జర్నలిస్ట్ చెబితే రియాక్ట్ అవడం ఏంటో మరి? మనిషి ఉన్నంత వరకేనా గౌరవం.. అనేలా దాసరిపై అభిమానం ఉన్న నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా రియాక్ట్ అవుతుండటం గమనార్హం.

ఇవి కూడా చదవండి:

రకుల్‌ని మోసం చేసిన అక్షయ్ కుమార్.. వీడియో చూశారా!

చీరకట్టులో ‘బిగ్‌బాస్’ బ్యూటీ శోభా శెట్టి.. సోషల్ మీడియా షేక్!

అరుదైన పిక్.. సూపర్‌స్టార్ రజనీకాంత్ ‘కండక్టర్’ ఐడీ కార్డ్!

Updated Date - May 30 , 2026 | 10:57 PM