సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Rahul Ramakrishna: రాహుల్‌ రామకృష్ణ ఓ జోకర్‌...

ABN, Publish Date - Jun 09 , 2026 | 09:45 AM

హాస్య నటుడు రాహుల్ రామకృష్ణ ఆంధ్ర ప్రదేశ్‌ డిప్యూటీ సీఎంను ఉద్దేశించి పెట్టిన ట్వీట్స్ సోషల్ మీడియాలో చర్చకు దారితీశాయి. సినిమా రంగానికి చెందిన వారు, జన సైనికులు విమర్శించడంతో రాహుల్‌ వాటిని తొలగించారు.

Rahul Ramakrishna

ప్రముఖ హాస్య నటుడు రాహుల్ రామకృష్ణ (Rahul Ramakrishna) కు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం అలవాటే. అయితే ఒక్కోసారి అదుపు తప్పి వ్యాఖ్యలు చేసే ఆయన ఆ తర్వాత నాలుక కరుచుకుని సారీ చెబుతుంటారు. అలానే తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుని సోషల్ మీడియా నుంచి వాటిని తొలగిస్తుంటారు. ఇటీవల ప్రొఫెసర్‌ నాగేశ్వరరావు వ్యాఖ్యలు చేసి, ఆ పైన సారీ చెప్పి వాటిని విత్‌ డ్రా చేసుకున్న తరహాలోనే రాహుల్ రామకృష్ణ సైతం ప్రవర్తించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ (Pawan Kalyan) నిర్వహిస్తున్న శాఖలకు సంబంధించిన కొన్ని ప్రశ్నలను సోషల్ మీడియా వేదికగా రాహుల్ రామకృష్ణ ప్రశ్నించారు. 'పెసా 1/70 చట్టం, గ్రామసభల అమలుకు సంబంధించిన ఫలితాలను ప్రజలకు తెలియజేయాలి. అటవీకరణ కార్యక్రమాలు ఎంతవరకు అమలయ్యాయి!? స్వతంత్ర సంస్థలు ధృవీకరించిన కొన్ని గణాంకాలపై సందేహాలు ఉన్నాయి' అని రాహుల్ రామకృష్ణ ట్వీట్‌ చేశారు. అలానే 'మీరు నిర్వహిస్తున్న ప్రతి శాఖలో సమాచార హక్కు చట్టంలోని సెక్షన్ 4(1) (బి) ప్రకారం ముందస్తు సమాచార వెల్లడిని పూర్తి స్థాయిలో అమలు చేశారా?' అంటూ పవన్ కళ్యాణ్‌ ను ప్రశ్నిస్తూ మరో ట్వీట్‌ చేశారు. ఇలా ప్రశ్నిస్తే నాపై దేశ ద్రోహి అనే ముద్రవేయరు కదా!' అంటూ రాహుల్‌ వ్యాఖ్యానించడం కొసమెరుపు. పవన్ కళ్యాణ్ అభిమానిగా ఈ ప్రశ్న వేస్తున్నానని రాహుల్‌ అతి కూడా చేశాడు.


పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశ్యపూర్వకంగా రాహుల్ రామకృష్ణ ఇలా టార్గెట్ చేయడంపై సినిమా రంగానికి చెందిన కొందరు మండిపడ్డారు. నటుడు, దర్శకుడు రాజ్ మాదిరాజు (Raj Madiraju) దీనిపై స్పందిస్తూ, 'రాహుల్.. నువ్వు అభిమానిగా అడిగితే నీకు జవాబు చెప్పాల్సిన అవసరం నీ అభిమాన హీరో పవన్ కళ్యాణ్‌కి లేదు. నువ్వు పౌరుడిగా అడిగితే చెబ్తాడు. అయితే నువ్వు ఆంధ్రా పౌరుడివి కాదు తెలంగాణా వాడివి. కాబట్టి ఆ విధంగా కూడా నీకు జవాబు చెప్పాల్సిన అవసరం ఒక ఆంధ్రా మంత్రిగా అతనికి లేదు. నీ ప్రశ్నలు ప్రస్తుతానికి తెలంగాణా మినిస్టర్లను అడగాలి. భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ ఇక్కడ తెలంగాణాలో గెలిచి ముఖ్య/ఉప ముఖ్యమంత్రి అయితే అప్పుడు కచ్చితంగా ఛాతీ విరుచుకుని అడిగే హక్కు నీకుంటుంది. ఒకవేళ ఆంధ్రాలో అతను సరైన పాలన చేయట్లేదని నీకనిపిస్తే తెలంగాణాలో వోట్లడగడానికి వొచ్చినప్పుడు నిగ్గదీసి నిలదీసి అడుగు. సో, ప్రశ్నలడిగితే నిన్నెవడూ దేశద్రోహి అనడు. కానీ నీ రాష్ట్రమంత్రులను నువ్వీ ప్రశ్నలడగకపోతే నిన్ను రాష్ట్రద్రోహి అని మాత్రం కచ్చితంగా అంటారు. అంతే కాదు.. సరైన వాడిని సరైన ప్రశ్నలు సరైన సమయంలో అడగకపోతే స్టుపిడ్ అని, జోకర్ అని కూడా అంటారు. పోతే నువ్వు చెప్పిన ఇండిపెండెంట్ బాడీ సేకరించిన (సీమింగ్లీ డూబియస్) వివరాలను బయటపెడితే మరింత ఆథెంటిగ్‌ గా ఉంటుంది' అని బదులిచ్చారు. అలానే దర్శకుల సంఘం అధ్యక్షుడు వి. ఎన్. ఆదిత్య (V.N. Aditya) సైతం రాహుల్ రామకృష్ణ వైఖరిని తప్పు పట్టారు.

రాహుల్ రామకృష్ణ మనసులోని భావాలను గ్రహించిన జన సైనికులు అతన్ని ఘాటుగా విమర్శించడంతో రాహుల్ రామకృష్ణ దిగి వచ్చారు. తన సోషల్ మీడియా అకౌంట్‌ నుంచి ట్వీట్స్ ను తొలగించారు. అయితే చివరిగా 'ఎవరినీ అగౌరపరిచే ఉద్దేశ్యం లేదు. అలా అనుకోలేదు. అందరూ బాగుండాలి... అందులో నేనుండాలి' అంటూ ఈ వ్యవహారానికి ఫుల్ స్టాప్ పెట్టాడురు రాహుల్‌ రామకృష్ణ.

ఇవి కూడా చదవండి:

Taapsee: వయసు పెరిగేది మాకేనా.. హీరోలకు పెరగదా?

Puri Jagannadh: నా తొలి.. తమిళ సినిమా స్లమ్‌డాగ్‌

Updated Date - Jun 09 , 2026 | 09:51 AM