Puri Jagannadh: నా తొలి.. తమిళ సినిమా స్లమ్‌డాగ్‌

ABN , Publish Date - Jun 09 , 2026 | 08:39 AM

దర్శకుడు పూరి జగన్నాథ్, తమిళ నటుడు విజయ్‌ సేతుపతి కాంబినేషన్‌లో రూపుదిద్దుకున్న యాక్షన్‌ డ్రామా ‘స్లమ్‌డాగ్‌... 33 టెంపుల్‌ రోడ్‌’ .

Puri Jagannadh

దర్శకుడు పూరి జగన్నాథ్ (Puri Jagannadh), తమిళ నటుడు విజయ్‌ సేతుపతి (Vijay Sethupathi) కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటున్న యాక్షన్‌ డ్రామా ‘స్లమ్‌డాగ్‌... 33 టెంపుల్‌ రోడ్‌’ (SlumDog - 33 Temple Road). ఈ సినిమాలో దృష్టి లోపం ఉన్న బిచ్చగాడి పాత్ర పోషిస్తున్నారు. సంయుక్త హీరోయిన్‌. సీనియ‌ర్ హీరోయున్‌ టబు పోలీస్‌ ఆఫీసర్‌ పాత్రను పోషించింది. విలన్‌గా క‌న్న‌డ అగ్ర న‌టుడు దునియా విజయ్‌ నటించారు. సోమ‌వారం ఈ మూవీ టీజ‌ర్‌ను చెన్నైలో అవిష్క‌రించారు.

ఈ సంద‌ర్భంగా.. విజయ్‌ సేతుపతి మాట్లాడుతూ ‘పూరి జగన్నాథ్‌ అద్భుతమైన వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి. ఆయన తీసిన అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి’ చిత్రాన్ని జయం రవి తమిళంలో రీమేక్‌ చేశారు. అందులో నేను జూనియర్ ఆర్టిస్టుగా నటించా. ఇప్పుడు ఆయన దర్శకత్వంలో హీరోగా నటించడం చాలా ఆనందంగా ఉంది. ‘స్లమ్‌డాగ్‌’ పూరిగారి సినిమాల్లో ఓ బెస్ట్‌ ఫిల్మ్‌ అవుతుంది’ అన్నారు.

దర్శకుడు పూరి జగన్నాథ్‌ మాట్లాడుతూ ‘నా తొలి తమిళ సినిమా స్లమ్‌డాగ్‌. విజయ్‌ సేతుపతి లాంటి నటుడు ఒక దర్శకుడికి దొరకడం చాలా అదృష్టం’ అని అన్నారు. త్వరలోనే తెలుగుతో పాటు తమిళ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల చేస్తామని నిర్మాతలు ఛార్మీ, జేబీ నారాయణరావు చెప్పారు.

Updated Date - Jun 09 , 2026 | 09:06 AM