రెండో పెళ్లి.. సమంత దారిలోనే కలర్స్ స్వాతి!
ABN, Publish Date - Jul 08 , 2026 | 07:49 PM
చిత్ర పరిశ్రమలో నటీనటులు తమకు నచ్చిన మనస్తత్వం ఉన్నవారినో, ఒకే రంగంలో ప్రయాణిస్తూ బాగా అర్థం చేసుకున్నవారినో జీవిత భాగస్వాములుగా ఎంచుకోవడం కొత్తేమీ కాదు.
చిత్ర పరిశ్రమలో నటీనటులు తమకు నచ్చిన మనస్తత్వం ఉన్నవారినో, ఒకే రంగంలో ప్రయాణిస్తూ బాగా అర్థం చేసుకున్నవారినో జీవిత భాగస్వాములుగా ఎంచుకోవడం కొత్తేమీ కాదు. కొందరు తమ తోటి నటీనటులను పెళ్లాడితే.. మరికొందరు తాము పనిచేసిన దర్శకులతోనే జీవితాన్ని పంచుకోవడానికి ఇష్టపడుతున్నారు. తాజాగా టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ ‘కలర్స్’ స్వాతి (Colors Swathi) సరిగ్గా ఇదే బాటలో నడిచింది. గతంలో వచ్చిన విడాకుల రూమర్లకు చెక్ పెడుతూ.. తన రీ-ఎంట్రీ సినిమా దర్శకుడితోనే స్వాతి ఏడడుగులు వేసింది. ఈ క్రమంలో ఆమె స్టార్ హీరోయిన్ సమంత (Samantha) రూట్‌ని ఫాలో అవ్వడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.
స్టార్ హీరోయిన్ సమంత గతంలో తనతో ‘ది ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్, అలాగే ‘సిటాడెల్: హనీ బన్నీ’ వంటి క్రేజీ ప్రాజెక్టులను తెరకెక్కించిన ప్రముఖ దర్శకుడు రాజ్ నిడిమోరు (Raj Nidimoru)ను ప్రేమించి, గతేడాది వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. సమంతకు ఇది రెండో వివాహం కాగా, ఆమె తన మనసుకు నచ్చిన తోడును ఒక దర్శకుడిలోనే వెతుక్కుంది. ఇప్పుడు సరిగ్గా అదే దారిలో నడుస్తూ.. టాలీవుడ్ చబ్బీ గర్ల్ స్వాతి కూడా తన లైఫ్ పార్టనర్‌గా ఒక దర్శకుడినే ఎంచుకుంది. 2018లో వికాస్ వాసు అనే మలయాళీ పైలట్‌ను వివాహం చేసుకుని ఆ తర్వాత విడాకులు తీసుకున్న స్వాతి.. ఇప్పుడు తన సెకండ్ ఇన్నింగ్స్‌ను సరికొత్తగా ప్రారంభించింది.
స్వాతి హీరోయిన్‌గా రీ-ఎంట్రీ ఇచ్చిన ‘మంత్ ఆఫ్ మధు’ అనే చిత్రానికి శ్రీకాంత్ నాగోతి (Srikanth Nagothi) దర్శకత్వం వహించారు. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే వీరిద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం, కెమిస్ట్రీ కుదిరిందని.. అది కాస్తా ప్రేమగా మారి పెళ్లి పీటల వరకు దారితీసిందని తెలుస్తోంది. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా శ్రీకాంత్ నాగోతితో జరిగిన వివాహ వేడుకకు సంబంధించిన ఫోటోను షేర్ చేసి.. స్వాతి అధికారికంగా తన రెండో పెళ్లి వార్తని ప్రకటించింది. దీంతో ‘అటు సమంత.. ఇటు స్వాతి.. ఇద్దరూ తమ రెండో పెళ్లి కోసం క్రేజీ దర్శకులనే ఎంచుకున్నారు’ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఈ కామెంట్లతో సమంత, స్వాతి పేర్లు ప్రస్తుతం టాప్‌లో ట్రెండ్ అవుతున్నాయి.
ఇవి కూడా చదవండి:
ఆ దర్శకుడితో రెండో పెళ్లి.. షాకిచ్చిన కలర్స్ స్వాతి
భాగ్యరాజ్‌ను ఐస్ బాక్సులో చూడలేకే.. ఊర్వశి షాకింగ్ కామెంట్స్
VK Naresh: ఏపీలోనూ తమిళనాడు తరహాలో...