సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

‘కష్టే ఫలి’.. మెగాస్టార్ మే డే స్పెషల్ పోస్ట్ వైరల్!

ABN, Publish Date - May 01 , 2026 | 07:37 PM

ప్రపంచవ్యాప్తంగా మే 1న జరుపుకునే అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి సమాజ నిర్మాణంలో శ్రామికుల పాత్రను కొనియాడారు.

Chiranjeevi May Day Post

ప్రపంచవ్యాప్తంగా మే 1న జరుపుకునే అంతర్జాతీయ కార్మిక దినోత్సవం (May Day) సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) సమాజ నిర్మాణంలో శ్రామికుల పాత్రను కొనియాడారు. మన దైనందిన జీవితాల్లో పొందే అనేక సౌకర్యాల వెనుక ఎందరో అజ్ఞాత వ్యక్తుల అవిశ్రాంత కృషి దాగి ఉందని ఆయన గుర్తు చేశారు. పేరు తెలియని ఆ వ్యక్తుల కష్టమే మన సమాజాన్ని ముందుకు నడిపిస్తోందని, వారి కృషికి అద్దం పట్టేలా చిరంజీవి తన మనసులోని భావాలను పంచుకున్నారు.


కష్టపడటం అనేది కేవలం శారీరక శ్రమ మాత్రమే కాదని, అది ఒక గౌరవప్రదమైన జీవన విధానమని చిరంజీవి అభిప్రాయపడ్డారు. ‘కష్టే ఫలి’ అనే సూక్తిని నమ్ముతూ, పనిలో ఉండే ఆత్మగౌరవాన్ని ఆయన నొక్కి చెప్పారు. సమాజాన్ని నిర్మించడంలో, సేవ చేయడంలో నిరంతరం శ్రమిస్తున్న ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక గౌరవాన్ని తెలియజేస్తూ, వారి పట్ల తనకున్న కృతజ్ఞతను చాటుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి చేసిన ఈ పోస్ట్ (Chiranjeevi May Day Post) ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


శ్రామిక శక్తి యొక్క గొప్పతనాన్ని ఇంత అర్థవంతంగా విశ్లేషించినందుకు అభిమానులు, నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సమాజం కోసం నిరంతరం కష్టపడే ప్రతి చేతికి ఆయన తెలిపిన ఈ గౌరవం, శ్రమజీవుల పట్ల ఉండాల్సిన సామాజిక బాధ్యతను మరోసారి గుర్తు చేసింది. శ్రమకు మారు పేరు చిరంజీవి.. ఆయన ఎంతో కష్టపడి ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నారని, ఈ విషయంలో ఆయన ఎందరికో ఆదర్శం అంటూ.. నెటిజన్లు చిరుకు మే డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి మాత్రమే కాకుండా, మరికొందరు సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా అంతర్జాతీయ కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకుని శుభాకాంక్షలు తెలుపుతూ, కార్మికుల గొప్పతనాన్ని గుర్తు చేసుకున్నారు.

ఇవి కూడా చదవండి:

తొక్కలో ఇంటర్వ్యూ.. అంటూ కుర్చీ విసిరేసి వెళ్లిపోయిన గెటప్ శ్రీను!

‘ఇద్దరి నుంచి ముగ్గురుగా’.. తల్లికాబోతోన్న శ్రీ విష్ణు హీరోయిన్!

‘భోగి’లో అనుపమ పరమేశ్వరన్.. ఫస్ట్ లుక్ మాములుగా లేదుగా!

కయాదు లోహర్‌ గురించి ఈ విషయాలు తెలుసా?

Updated Date - May 01 , 2026 | 07:43 PM