సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

మృత్యువుకే ఎదురెళ్ళిన వీరనారీమణులు

ABN, Publish Date - Nov 12 , 2026 | 06:40 PM

క్యాన్సర్ అనే మాట వినగానే ఎవరికైనా ఒక్కసారిగా గుండె ఆగినంత పనవుతుంది. కానీ తెరపై మెరిసే హీరోయిన్స్ మృత్యువుకే ఎదురెళ్ళి అసలైన హీరోలని నిరూపించుకున్నారు. ఆ మహమ్మారిని చూసి భయపడకుండా..చిరునవ్వుతో ఎదిరించి గెలిచి ఎందరిలోనో కొత్త ఆశలు చిగురింపచేశారు.

cancer survivor heroines

క్యాన్సర్... ఆ పేరు వింటేనే వణుకు వచ్చేస్తోంది. సైలెంట్ కిల్లర్‌లా ఎప్పుడు ఎవరి జీవితంలోకి అడుగుపెడుతుందో తెలియని ఈ మహమ్మారి ఎందరినో భయపెడుతోంది. అయితే ఈ వ్యాధి విసిరిన సవాళ్ళకు బెదిరిపోకుండా.. కన్నీళ్ళను దాచుకుని చిరునవ్వుతో దాన్ని ఎదిరించి గెలుస్తున్నారు వెండితెర భామలు. సౌత్, నార్త్ కు చెందిన కొంతమంది హీరోయిన్స్ మృత్యువునే గెలిచి మళ్ళీ కెమెరా ముందుకు వచ్చి ధైర్యం చెబుతున్నారు. తాజాగా హీరోయిన్ మోనాల్ గజ్జర్ కూడా ఇలాంటి కఠిన పరీక్షనే దాటారు. అంతేకాక తన సంకల్ప బలాన్ని ప్రపంచానికి చాటారు.


'సుడిగాడు', 'బ్రదర్ ఆఫ్ బొమ్మలి' సినిమాలతో తెలుగు ఆడియెన్స్ కు దగ్గరైన మోనాల్ 'పాపిల్లరీ థైరాయిడ్ కార్సినోమా' అనే థైరాయిడ్ క్యాన్సర్ బారిన పడ్డారు. అయితే ఏ మాత్రం బెదరకుండా సర్జరీ చేయించుకుని.. ఆ వ్యాధి నుంచి కోలుకుని ఆరోగ్యంగా తిరిగొచ్చినట్లు ఎక్స్ వేదికగా అభిమానులతో పంచుకున్నారు. అంతేకాక ఉరుకుల పరుగుల జీవితంలో ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయొద్దని.. ప్రశాంతమైన మనస్సు, ఆరోగ్యమే అసలైన ఆస్తి అని అందరికీ గుర్తుచేశారు. అంతేకాక తరచూ హెల్త్ చెకప్స్ చేయించుకోవాలని.. మహిళలందరూ తప్పనిసరిగా సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ వేయించుకోవాలని మోనాల్ సూచించారు.

మోనాల్ లాగే ఎందరో తారలు మృత్యువు అంచుల దాకా వెళ్ళి గెలిచి నిలిచారు. నాలుగో స్టేజ్ క్యాన్సర్ అని తెలిసినా కుంగిపోకుండా.. జుట్టు రాలిపోయినా గుండుతోనే ఎంతో హుందాగా కెమెరా ముందుకొచ్చి అందరికీ ధైర్యం చెప్పారు బాలీవుడ్ హీరోయిన్ సోనాలి బింద్రే. ఇటు అండాశయ క్యాన్సర్‌ను జయించిన మనీషా కోయిరాలా, తన పోరాట అనుభవాలను 'హీల్డ్' పేరుతో పుస్తకంగా రాసి ఎందరికో స్ఫూర్తినిచ్చారు. ఇక హీనా ఖాన్ మూడో స్టేజ్ రొమ్ము క్యాన్సర్‌తో పోరాడుతూనే.. కీమోథెరపీ బాధలను భరిస్తూ షూటింగ్‌లలో పాల్గొనడం ఆమె ఆత్మస్థైర్యానికి నిదర్శనం.


ఇటు సౌత్ తారలు కూడా ఈ విషయంలో ఎందరికో ఆదర్శంగా నిలిచారు. రొమ్ము క్యాన్సర్‌ను జయించిన గౌతమి, బాధితులకు అండగా నిలవడంతో పాటు ఒక సేవా సంస్థనే నడుపుతున్నారు. టాలీవుడ్ లో ఐటమ్ సాంగ్స్ కు కేరాఫ్ గా నిలచిన హంసానందిని సైతం రొమ్ము క్యాన్సర్‌పై వీరోచిత పోరాటం చేసి తిరిగి కోలుకున్నారు. ఇక మమతా మోహన్‌దాస్ అయితే రెండుసార్లు లింఫోమా క్యాన్సర్‌ను ఎదిరించి.. తన చిరునవ్వుతోనే ఆ వ్యాధిని ఓడించారు. వీరితో పాటు మహిమా చౌదరి, ముంతాజ్ కూడా క్యాన్సర్‌ను గెలిచి నిలిచిన ధీరవనితలే.

క్యాన్సర్ అనేది జీవితానికి ముగింపు కాదని ధైర్యంగా ఉంటే అది కేవలం ఒక చిన్న విరామం మాత్రమేనని ఈ ముద్దుగుమ్మలంతా తమ జీవితాలతో నిరూపించారు. ఓటమి అంచుదాకా వెళ్ళి మళ్ళీ తిరిగొచ్చిన ఈ భామల పోరాట పటిమ లక్షలాది మంది బాధితుల జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతోంది.

ALSO READ:
Rahul gowlikar: ఐడీల జారీలో జాప్యం లేదు.. సెన్సార్ సమస్యలపై ప్రభుత్వానికి లేఖ రాస్తాం!

Censor Issue: చివరి నిమిషంలో టైటిల్ మార్చాలా? నిర్మాతలకు కోట్ల నష్టం తప్పదా?

Anil Ravipudi: ఓవర్సీస్‌లో అనిల్ రావిపూడి మాస్టర్ ప్లాన్.. సందడే సందడి..

Updated Date - Nov 12 , 2026 | 06:40 PM