సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

రాత్రి తాగుతావు.. పొద్దున్నే వాగుతావు: ప్రకాష్ రాజ్‌పై బండ్ల ఫైర్

ABN, Publish Date - Jul 06 , 2026 | 02:08 PM

‘రావణ్’ విషయంలో మరోసారి ప్రకాష్ రాజ్ సోషల్ మీడియా వేదికగా ఓ వీడియోను పోస్ట్ చేశారు. రావణ్ అరెస్ట్ అయినప్పటి నుంచి ప్రకాష్ రాజ్ సోషల్ మీడియా వేదికగా యమా యాక్టివ్‌గా కనిపిస్తున్న విషయం తెలిసిందే.

Prakash Raj and Bandla Ganesh

‘రావణ్’ విషయంలో మరోసారి ప్రకాష్ రాజ్ (Prakash Raj) సోషల్ మీడియా వేదికగా ఓ వీడియోను పోస్ట్ చేశారు. రావణ్ (Raavan) అరెస్ట్ అయినప్పటి నుంచి ప్రకాష్ రాజ్ సోషల్ మీడియా వేదికగా యమా యాక్టివ్‌గా కనిపిస్తున్న విషయం తెలిసిందే. అలాగే, ప్రకాష్ రాజ్‌పై బండ్ల గణేష్ (Bandla Ganesh) కూడా అదే రేంజ్‌లో ఫైర్ అవుతున్నారు. ‘‘నువ్వు ఎందుకు ఇంత ఓవర్ యాక్షన్ చేస్తున్నావో అర్థం కావడం లేదు. ఎవరి మెప్పు కోసం ఈ డ్రామా? ముందు నీ స్థాయి, నీ బాధ్యత, నీ వ్యక్తిత్వం ఏమిటో ఒకసారి అద్దంలో చూసుకుని, నీ మనస్సాక్షిని ప్రశ్నించుకో..’’ అంటూ ప్రకాష్ రాజ్‌కు ఇప్పటికే హితబోధ చేసిన బండ్ల గణేష్.. మరోసారి ప్రకాష్ రాజ్ షేర్ చేసిన వీడియోకు కౌంటర్ ఇస్తూ షాకింగ్‌‌‌గా రియాక్ట్ అయ్యారు.


‘‘రాత్రి తాగుతావు.. పొద్దున్నే వాగుతావు.. అంతే తప్ప నీ జీవితంలో ఒక్క పని కూడా లేదు. ఒక వ్యాపారం లేదు, ఒక సినిమా లేదు, ఒక షూటింగ్ లేదు. పనికిరాని మాటలు, పనికిరాని పోస్టులు, పనికిరాని గొడవలు.. ఇదే నీ దినచర్య. హాయిగా నీ పని నువ్వు చూసుకుని, సంతోషంగా బతుకు. అనవసరంగా ఇతరుల గురించి నోరు పారేసుకుని నీ విలువను నువ్వే తగ్గించుకోకు’’.. అని బండ్ల గణేష్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. ఈ ట్వీట్‌కు నెటిజన్లు కూడా ఆయనకు సపోర్ట్ అందిస్తున్నారు. ‘హిందువులను ధ్వేషించేవారికి సపోర్ట్ చేస్తూ.. నీ బుద్ధి ఏంటో తెలియజేస్తున్నావ్’ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తుండటం విశేషం. ఇక బండ్ల గణేష్ ఇలా రియాక్ట్ అవడానికి కారణమైన వీడియోలో ప్రకాష్ రాజ్ ఏమంటున్నారంటే..


‘‘వరుసగా తప్పుడు కేసులు పెట్టినా.. నాలుగు సార్లు కోర్టు బెయిల్ ఇస్తే, ‘యూఏపీఏ’ (UAPA) వాడి ఒక యూట్యూబర్‌ని రిమాండ్‌లోకి పంపిస్తారా? అంటే, యువరాజుని ప్రశ్నిస్తే దేశద్రోహం! వెరీ గుడ్. ఇది.. ప్రశ్నించే గొంతుల్ని నొక్కడానికి మీరు చేస్తున్న కుట్ర అని అందరికీ క్లియర్‌గా అర్థమైంది. నెక్స్ట్ ఏంటి? క్యారెక్టర్ అస్సాసినేషన్! ఆల్రెడీ జనసైనికులు ఏఐ వీడియోలు చేసి.. స్టార్ట్ చేశారు. మీరేం చేస్తారు? వాడి ఫోన్ మీ దగ్గరుంది.. అందులో ఉన్న పర్సనల్ ఇన్ఫర్మేషన్‌ని వక్రీకరించి దాన్ని లీక్ చేస్తూ, ఆయన్ని ఇబ్బంది పెడుతూ.. ఆ మూలంగా ఆయనకి అండగా నించున్నవాళ్ళని, ఎన్నో ప్రశ్నించే గొంతుల్ని భయపెట్టడానికి ప్రయత్నం చేస్తారు కదా? దిగజారండి.. దిగజారుతూ ఉండండి. ఎంత కిందకి దిగజారుతారో ప్రజలు చూస్తూ ఉంటారు. ప్రొఫెసర్ నాగేశ్వర్‌తో మీ ఆట మొదలైంది. కానీ ఈ ఆటకి ముగింపు ప్రజలే ఇస్తారు.. ఇస్తారు. గేమ్ ఆన్!’’ అంటూ ఆయన తన మార్క్ నవ్వుతో చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి:

ఎన్టీఆర్ 'గాడ్ ఆఫ్ వార్'లో బాలీవుడ్ హీరో?

కెవిఎన్ ప్రొడక్షన్స్‌లో నార్నే నితిన్ చిత్రం ప్రారంభం.. ఇద్దరు హీరోయిన్లు!

ప్రకాష్ రాజ్.. ఎందుకింత ఓవరాక్షన్ చేస్తున్నావ్?: బండ్ల గణేష్

Updated Date - Jul 06 , 2026 | 02:08 PM