సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

పెద్ద మనసుతో క్షమించండి.. బండ్ల గణేష్ పోస్ట్ వైరల్

ABN, Publish Date - Aug 17 , 2026 | 06:05 PM

టాలీవుడ్ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ తన కుమార్తె జనని (Janani) వివాహాన్ని ఆగస్ట్ 16, ఆదివారం హైదరాబాద్‌లో అత్యంత వైభవంగా జరిపించిన విషయం తెలిసిందే. ఈ వివాహం అనంతరం బండ్ల గణేష్ చేసిన ఎమోషనల్ పోస్ట్ వైరల్ అవుతోంది.

Bandla Ganesh

టాలీవుడ్ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ (Bandla Ganesh) తన కుమార్తె జనని (Janani) వివాహాన్ని ఆగస్ట్ 16, ఆదివారం హైదరాబాద్‌లో అత్యంత వైభవంగా జరిపించిన విషయం తెలిసిందే. సూర్యతేజ (Surya Teja)తో జరిగిన ఈ వివాహ వేడుకకు సినీ, రాజకీయ, వ్యాపార రంగాలకు చెందిన ఎందరో ప్రముఖులు, స్టార్ హీరోలు, అగ్ర దర్శకులు, నిర్మాతలు తరలివచ్చి నూతన వధూవరులను మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు. పెద్దల సమక్షంలో, బంధుమిత్రుల కోలాహలం నడుమ ఈ వేడుక కన్నులపండువగా ముగిసింది. ఈ సందర్భంగా తన కూతురి పెళ్లికి వచ్చి, ఆశీస్సులు అందించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలుపుతూ బండ్ల గణేష్ సోషల్ మీడియా వేదికగా ఓ భావోద్వేగ సందేశాన్ని పంచుకున్నారు.


తన సందేశంలో.. ‘‘నిన్న నా కుమార్తె జనని వివాహ వేడుకకు విచ్చేసి, నూతన దంపతులను ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మా కుటుంబంతో ఉన్న గాఢమైన అనుబంధంతో, ఆప్యాయతతో తమ విలువైన సమయాన్ని కేటాయించి ఈ శుభకార్యానికి తరలివచ్చిన పెద్దలు, నా ప్రాణసమానులైన ఆత్మీయులు, సినీ మిత్రులు, శ్రేయోభిలాషులందరికీ పేరుపేరునా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీ అందరి రాకతో మా ఇంట్లో జరిగిన ఈ పండుగ వేడుక మరింత ప్రత్యేకంగా, ఎంతో ఆనందంగా మారింది. మీరు అందించిన ప్రేమ, ఆశీర్వాదాలు మా కుటుంబానికి జీవితాంతం గుర్తుండిపోయే మధుర జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి’’ అని బండ్ల తన సంతోషాన్ని తెలియజేశారు.


అంతేకాకుండా, ఇంతటి భారీ వేడుకలో ఏవైనా లోటుపాట్లు జరిగి ఉంటే పెద్ద మనసుతో అర్థం చేసుకోవాలని ఆయన కోరారు. ‘‘మా ఈ వివాహ మహోత్సవానికి విచ్చేసిన అతిథులకు, పెద్దలకు ఎలాంటి అసౌకర్యం లేదా ఇబ్బంది కలిగి ఉన్నా దయచేసి పెద్ద మనసుతో నన్ను క్షమించండి. మీ నిరంతర ప్రేమ, అభిమానం, ఆశీస్సులు మా కుటుంబంపై ఎల్లప్పుడూ ఇలాగే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’’ అంటూ బండ్ల గణేష్ ఇందులో పేర్కొన్నారు. కుమార్తెపై ఉన్న ప్రేమను చాటుకుంటూ, అతిథుల పట్ల చూపించిన ఈ వినయంపై నెటిజన్లు, సినీ వర్గాలు ప్రశంసలు కురిపిస్తూ నూతన జంటకు మరోసారి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

ఇవి కూడా చదవండి:

వరుణ్ తేజ్‌కు హిట్.. కనకరాజు 10 డేస్ కలెక్షన్స్ ఎంతంటే

దొంగ జూబ్లీస్... బాబోయ్ దొంగ జూబ్లీస్...

సంక్రాంతి రేసులో ఇగో వార్.. తగ్గేదేలేదంటూ

Updated Date - Aug 17 , 2026 | 06:05 PM