అగ్గిపెట్టి మచ్చకు తీవ్ర అస్వస్థత.. పరిస్థితి విషమం

ABN , Publish Date - Oct 07 , 2026 | 12:30 PM

సోషల్ మీడియాలో ఫేమ్ అయిన అగ్గిపెట్టి మచ్చ అలియాస్ కిరణ్ అస్వస్థతకు గురయ్యారు.

Aggipetti Maccha

సోషల్ మీడియాలో విప‌రీత‌మైన గుర్తింపు ఉన్న అగ్గిపెట్టి మచ్చ (Aggipetti Maccha) అలియాస్ కిరణ్ (Kiran) అస్వస్థతకు గురయ్యారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆరోగ్యం ఇటీవల విషమించినట్లు తెలుస్తోంది. దీంతో కుటుంబ సభ్యులు అక్టోబర్ 5న తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (SVIMS)కు తరలించారు.

Aggipetti Maccha

ప్రస్తుతం కిరణ్‌కు వైద్యులు వెంటిలేటర్ సపోర్ట్‌తో చికిత్స అందిస్తున్నట్లు సమాచారం. ఆయన ఆరోగ్య పరిస్థితిపై విషయం తెలుసుకున్న అభిమానులు, స్నేహితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కిరణ్ త్వరగా కోలుకుని క్షేమంగా తిరిగి రావాలని సోషల్ మీడియా వేదికగా ఆకాంక్షిస్తున్నారు. కాగా కిరణ్ ఆరోగ్యానికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి:

అభిమాని హ‌త్య కేసు.. దర్శన్‌కు మరో బిగ్ షాక్

ధనుష్ కొత్త పార్టీ.. 'తమిళగ ఎళుచ్చి కళగం'? ఈసీ వద్ద నమోదు!

నిన్న రాజశేఖ‌ర్.. నేడు విజ‌య శాంతి! అస‌లు బాల‌య్య‌తో.. ఏం ఫ్లాన్ చేస్తున్నావ్ శివ‌య్య

Updated Date - Oct 07 , 2026 | 12:44 PM